ప్రస్తుత పరిస్థితుల్లో నీకంటూ ఒక గూడు ఉండాలి అందుకే నీకు ఈ ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చాను అని పరంధామయ్య తులసితో చెప్తాడు. నందు, లాస్య జాబ్ కోసం చూస్తూ ఉంటుంటే భాగ్య ఎంట్రీ ఇస్తుంది. మీకేమో ఉన్నవి ఊడుతున్నాయ్ ఆమెకేమో లేనివి కలిసి వస్తున్నాయ్ అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ అని లాస్య అడుగుతుంది. ఎవరి గురించో కాదు తులసి గురించి మీకు ఉద్యోగాలు ఊడగొట్టి ఆవిడ గారు సంతోషంగా గృహప్రవేశం చేస్తుందని చెప్తుంది. మావయ్య గారు పాత ఇల్లు మళ్ళీ కొని తులసక్కకి గిఫ్ట్ గా ఇచ్చారని చెప్తుంది. ఆ మాటకి లాస్య షాక్ అవుతుంది. మనల్ని పిలవకుండా ఇలా చేశారు ఏంటి అని లాస్య నందు మీద అరుస్తుంది.
భాగ్య: అంత విలువైన ఇంటికి తులసక్కకి గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి, మీ నాన్నకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరు గుర్తురాలేదా మీరు వదిలేసిన తులసికి ఇచ్చారు. లక్షలు పోసి ఆ ఇంటిని గిఫ్ట్ గా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది
నందు: అది మా నాన్నగారి డబ్బు ఆయన ఇష్టం అందులో మనం అడగటానికి ఏముంది
భాగ్య: అంత ఈజిగా తీసిపారేశారు ఏంటి బావగారు
లాస్య: అవసరాలకి బంధాలు పక్కన పెట్టాలి, ఉద్యోగాలు పోయి కనీసం ఇంటి అద్దె కట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. నువ్వు పద్ధతి అని మడి కట్టుకుని కూర్చుంటే కుదరదు. మీ నాన్న గారు పద్ధతిగా నిన్ను పిలిచి డబ్బు గురించి ఏమైనా మాట్లాడారా
భాగ్య: ఇన్నాళ్ళూ ఎక్కడ డబ్బు దాచారో ఏంటో ఇంకా ఆయన దగ్గర ఎంత డబ్బు మూలుగుతుందో ఏంటో
నందు: మీరు ఎన్నైనా చెప్పండి నాకు దీంట్లో తలదూర్చడం ఇష్టం లేదు
Also Read: దేవిని తీసుకెళ్లిపోతానని తెగేసి చెప్పిన ఆదిత్య- గుండెలు పగిలేలా ఏడుస్తున్న రుక్మిణి
లాస్య, భాగ్య మాత్రం మీరు అలా అనకండి కనీసం పక్కన అయిన ఉండండి మిగతాది మేము చూసుకుంటాం అనేసరికి నందు సరే అంటాడు. తులసి కొత్త ఇంట్లో పూజ చేసి హారతి తెచ్చి ఇంట్లో వాళ్ళకి ఇవ్వబోతుంటే సామ్రాట్ ఎంట్రీ ఇస్తాడు. ఈ ఇంట్లో మొదటి హారతి నేనే తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని అంటాడు. మేము ఇక్కడ ఉన్నామని మీకు ఎవరు చెప్పారు అని తులసి అడిగితే మనం ఇక్కడ ఉండటానికి కారణం ఆయనే అని పరంధామయ్య చెప్తాడు. నేను ఏం చేశాను కోర్టు నుంచి బయటపడిన లిటిగేషన్ ల్యాండ్ నేను కొన్నాను అంతేగా అని సామ్రాట్ చెప్తాడు. ఆ ల్యాండ్ మీరు సమయానికి కొనబట్టే కదా నేను సమయానికి ఈ ఇల్లు కొనగలిగింది అని పరంధామయ్య చెప్తాడు.
అప్పుడే లాస్య, భాగ్య, నందు ఎంట్రీ ఇస్తాడు. మీ దయాగుణం చూస్తుంటే ముచ్చటేస్తుంది సామ్రాట్ అని లాస్య అంటుంది. ఏకవచనంతో పిలిచేసరికి సామ్రాట్ కోపంగా చూస్తాడు. మా ఇంటికి వచ్చిన అతిథిని అనే మాటలు అర్హత నీకు లేదని తులసి అంటుంది. ఎందుకు మీకింత పక్షపాతం కోడలి కానీ కోడలికి ఇలా సాయం చేస్తున్నారని లాస్య అడుగుతుంది. మావయ్య గారు చేసిన దాన్ని మీరు సమర్దిస్తున్నారా అని భాగ్య అనసూయని అడుగుతుంది. నేను ఎవరికి సమాధానం చెప్పను అని పరంధామయ్య చెప్పేస్తాడు. ఎవరి చెప్పుడు మాటలు వినడానికి నేనేమీ నందగోపాల్ ని కాదు మంచి ఏదో చెడు ఏదో నాకు తెలుసు అని అంటాడు.
Also Read: వేద ముందు యష్ ని బ్యాడ్ చేస్తున్న మాళవిక- అమితమైన ప్రేమ చూపించిన ఖుషి
నా ఆపరేషన్ కి డబ్బు కోసం ఏ కొడుకు ముందుకు రాలేదు, నా కోడలు కానీ కోడలు కష్టపడింది అప్పుడు ఏమయ్యారు మీరంతా అని పరంధామయ్య నిలదీస్తాడు. నా స్వార్జితంతో ఈ ఇల్లు కొని తులసికి ఇచ్చాను దాని గురించి అడిగే హక్కు మీకెవ్వరికి లేదు, నా చివరి శ్వాస వరకు నేను ఈ ఇంట్లో తులసి దగ్గరే ఉంటాను అని పరంధామయ్య తేల్చే చెప్పేస్తాడు. ఏది ఏమైనా కొడుకులని కాదని ఆస్తి తులసక్కకి ఇవ్వడం చెల్లదు అని భాగ్య అంటుంది. మీకు ఒకసారి చట్టం ఏం అంటుందో చెప్పమంటారా అని సామ్రాట్ జోక్యం చేసుకుంటాడు. ఏ హక్కుతో మీరు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకండి అని నందు అంటాడు. మీరు ఏమైనా అనండి కానీ నన్ను మాత్రం పరాయి మనిషితో పోల్చకండి అని నందు అసహనంగా మాట్లాడతాడు. లాస్య మాత్రం సామ్రాట్, తులసి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. స్వార్థంతో ఈ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టాలని సామ్రాట్ చూస్తున్నాడని లాస్య అంటుంది. తులసి లాస్య మీద అరుస్తుంటే నందు కూడా ఎదురుతిరుగుతాడు. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం నీకు సామ్రాట్ కి స్నేహం ఉంటే అది మీ వరకే చూసుకో మా వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చెయ్యకు అని నందు కోపంగా చెప్తాడు.
తరువాయి భాగంలో..
తులసి కోసం సామ్రాట్ ఇంటికి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. నా ఫ్రెండ్ సామ్రాట్ వచ్చాడు తనతో కలిసి ఆఫీసు పని మీద వరంగల్ వెళ్తున్నా అని కావాలని నొక్కి మరి చెప్తుంది. దానికి లాస్య, నందు వెటకారం చేస్తూ నానామాటలు అంటారు. ఇన్ని మాటలు పడుతూ వెళ్ళడం అవసరమా తులసి అని అనసూయ అంటుంది.