ఖుషి ఒక కథ చెప్తుంటే అది యష్ చేసిన పనికి కనెక్ట్ అవుతుంది. హీరో తను చేసిన పని హీరోయిన్ దగ్గర దాచి పెట్టడం తప్పు కదా అని తను వెరీ వెరీ బ్యాడ్ అనేసరికి యష్ కోపంగా తనమీద అరుస్తాడు. ఇప్పుడు ఏమైందని ఖుషి మీద అరిచారు, కావాలంటే నా మీద అరవండి మీ టెన్షన్ తీసుకొచ్చి తన మీద చూపిస్తే ఎలా అని వేద అడుగుతుంది. పసి పిల్లలతో ఎలా బిహేవ్ చెయ్యాలో నాతో చెప్పించుకోకండి, నా ఖుషిని బాధపెడితే ఊరుకోను, నాకు ఖుషి తర్వాతే ఏదైనా ఎవరైనా అని యష్ టి తిట్టి వెళ్ళిపోతుంది.


ఖుషి బాధగా ఏడుపు మొహం పెట్టి గదిలో కూర్చుంటుంది. వేద వచ్చి పలకరిస్తుంది. నేను ఏం తప్పు చేశానని డాడీ నా మీద అరిచారని అడుగుతుంది. డాడీ ఆఫీసు వర్క్ చేసుకుంటున్నారు కదా ఆ చిరాకులో ఏదో అనేశారు, తర్వాత చాలా ఫీల్ అయ్యారు అని వేద బుజ్జగిస్తుంది. యష్ కూడా అరిచినందుకు ఫీల్ అవుతూ సోరి చెప్తాడు. ఖుషి వచ్చి యష్ కి సోరి చెప్తుంది. తనని దగ్గరకి తీసుకున్న యష్ లేదు నాన్న నేనే అనవసరంగా నీ మీద అరిచాను సోరి అని ముద్దు పెడతాడు. ఖుషి సంతోషంగా ఐ లవ్యూ చెప్తుంది. అదంతా చూస్తున్న వేద యష్ ని అరిచింది గుర్తు చేసుకుని వెళ్ళి సోరి చెప్పేస్తుంది. ఇందాక నా ఖుషి అన్నాను కాదు మన ఖుషి అని క్యూట్ గా అనేస్తుంది.


Also read: పరంధామయ్య సర్ ప్రైజ్- తులసికి పూలతో ఘన స్వాగతం


డాడీ నువ్వు పక్కన లేకపోతే నాకే కాదు అమ్మకి కూడా నిద్రపట్టడం లేదంట రా వెళ్ళి పడుకుందామని పిలిచి తీసుకెళ్తుంది. ముగ్గురు పడుకుని ఖుషి చాలా సంతోషంగా కబుర్లు చెప్తూ ఉంటుంది. మీరిద్దరు నాతో ఎప్పటికీ ఇలాగే ఉంటానని ప్రామిస్ చేయమని ఖుషి అడిగితే ప్రామిస్ చేస్తారు. యష్ మాత్రం నిద్రపోకుండా ఆదికి ఇచ్చిన ప్రామిస్ గురించి, వేద తన మీద పెట్టుకున్న నమ్మకం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎంత పెద్ద తప్పు చేస్తున్నా యాక్సిడెంట్ చేసింది మాళవిక అని ఎందుకు దాస్తున్నాను, అత్తయ్య మావయ్య నన్ను కొడుకుగా అనుకుంటున్నారు, వేద అయితే నన్ను గుడ్డిగా నమ్ముతుంది. ఇంత పెద్ద నిజం వాళ్ళ దగ్గర దాచవచ్చా. ఇది కరెక్ట్ కాదు చెప్పేస్తాను. జరిగింది జరిగినట్టు వేదకి చెప్పేస్తాను అని అనుకుంటాడు.


వేద దగ్గరకి వెళ్ళి విషయం చెప్పడానికి తనని నిద్ర లేపబోతుంటే మాళవిక ఫోన్ చేస్తుంది. చాలా క్రిటికల్ టైమ్ లో నాకు సపోర్ట్ గా నిలబడ్డావ్ చాలా థాంక్స్ అని మాళవిక అంటుంది. లీగల్ గా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని యష్ మాళవికకి చెప్తాడు. వేదకి విషయం చెప్తాను అని యష్ అంటాడు. కానీ అందుకు మాళవిక మాత్రం ఒప్పుకోదు. అప్పుడే యష్ కోసం వేద బయటకి వస్తుంది.  


Also read: మాధవ్ కాలర్ పట్టుకుని నిలదీసిన రుక్మిణి- అక్క గురించి అపార్థం చేసుకుంటూనే ఉన్న సత్య


తరువాయి భాగంలో..


యష్, మాళవిక కలుసుకోవడం వేద దూరం నుంచి చూస్తుంది. వెంటనే కావాలని యష్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. మాళవిక మాత్రం వేదని చూస్తుంది. కావాలనే తనతో క్లోజ్ గా మూవ్ అవుతుంది. అది చూసి వేద చాలా బాధపడుతుంది.