పరంధామయ్య తులసి గదిలో ఒక గిఫ్ట్ బాక్స్ పెడతాడు. నీ కోసమే అది అక్కడ పెట్టాను అని చెప్తాడు. అందులో ఏముంది అని అనసూయ అడుగుతుంది. దాన్ని ఓపెన్ చెయ్యమని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. వద్దు ఉండు అని పరంధామయ్య అంటాడు. బాక్స్ ఈపేన్ చెయ్యడానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అక్కడికి వెళ్దామని చెప్తాడు. ఎక్కడికో చెప్పకుండా సర్ ప్రైజ్ అంటూ అందరినీ తీసుకుని వెళతాడు. తులసి పాత ఇంటి దగ్గరకి వచ్చి కార్లు ఆగుతాయి. మీ మనసులో ఏముందో అర్థం కావడం లేదు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారని అందరూ అడుగుతారు. తులసి బాధగా మన ఇంటికి వెళ్లిపోదాం అని అంటుంది. చేతకానితనంతో ఈ ఇంటిని పోగొట్టుకున్నా ఉండలేను వెళ్లిపోదామని చెప్తుంది. కానీ పరంధామయ్య మాత్రం ఆపుతాడు.
ఈ ఇంటితో ఉన్న అనుబంధం నాకు తెలుసు.. ఇక్కడ నిలబడి ఈ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చెయ్యమని చెప్తాడు. అందులో ఇంటి తాళాలు, డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి చూసి తులసి షాక్ అవుతుంది. ప్రేమ వాటిని తీసుకుని చూస్తాడు. ఈ ఇల్లు అమ్మ పేరు మీద రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ అని ప్రేమ్ చెప్తాడు. నువ్వు పోగొట్టుకున్నది మళ్ళీ నీ దగ్గరకి వచ్చిందని పరంధామయ్య ఎమోషనల్ గా చెప్తాడు. జీవితంలో మొదటిసారి నేను పోగొట్టుకున్నది దొరికింది అని తులసి సంతోషంగా చెప్తుంది. నీకు ఈ ఇంటిని మళ్ళీ ఇవ్వడం నా కల, అది జరగదు అనుకున్నా కానీ నాకు ఆ అవకాశం మళ్ళీ దక్కింది అని పరంధామయ్య చెప్తాడు. ఈ ఇంటికి కొనడానికి అంత డబ్బు ఎక్కడిది అని అనసూయ అడుగుతుంది. ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని అంటాడు.
Also read: మాధవ్ కాలర్ పట్టుకుని నిలదీసిన రుక్మిణి- అక్క గురించి అపార్థం చేసుకుంటూనే ఉన్న సత్య
ఈ ఇల్లు తన పేరు మీద వద్దని తులసి చెప్తుంది. ఇది నేను నీకు ఇస్తున్న బహుమతి కాదని అంటే నన్ను అవమానించడమే అని పరంధామయ్య అంటాడు. ఆ మాటకి అంత మాటలు వద్దు మావయ్య మీ కొడుకు నాకు విడాకులు ఇచ్చిన నన్ను కూతురులా చూసుకుంటున్నారు అది చాలు. ఇంత ఖరీదైన బహుమతి కాపాడుకునే శక్తి నాకు లేదు మీ పేరునే ఉండనివ్వండి అని తులసి బాధగా అడుగుతుంది. కానీ పరంధామయ్య మాత్రం అందుకు ఒప్పుకోడు. ఇంట్లో అందరూ తులసికి కంగ్రాట్స్ చెప్తారు. పరంధామయ్య తులసి నిలయం బోర్డు తీసుకొచ్చి తగిలించమని చెప్తాడు. అది చూసుకుని తులసి మురిసిపోతుంది. తులసితో సహ అందరూ సంతోషంగా ఇంట్లోకి అడుగుపెడతారు.
తులసి మీద పూలు చల్లుతూ స్వాగతం చెప్తారు. ఇంట్లో తిరుగుతూ తన పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది. ఎదుటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల తన జీవితం గాడి తప్పిందని బాధపడుతుంది. ఇంత ఖర్చు పెట్టి ఈ ఇల్లు బహుమతిగా ఇవాల్సిన అవసరం ఏమొచ్చిందని తులసి పరంధామయ్యని అడుగుతుంది.
Also read: మాళవిక ఉచ్చులో చిక్కుకున్న యష్- ఆదిని ఎరగా వేసి ఆడుకుంటున్న మాజీ పెళ్ళాం
తరువాయి భాగంలో..
తులసి పూజ చేసి హారతి తీసుకోమని ఇంట్లో వాళ్ళని పిలిస్తే సామ్రాట్ వచ్చి తొలి హారతి తీసుకుంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. స్వార్థంతో నువ్వే మా ఫ్యామిలీలో గొడవలు సృష్టించాలని చూస్తున్నావ్ అని లాస్య సామ్రాట్ ని నిలదీస్తుంది. నందు కూడా మా ఫ్యామిలీ విషయాల్లో అతన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావ్, అతన్ని బయటకి వెళ్లమను మనం ప్రశాంతంగా మాట్లాడుకుందామని అని తులసికి చెప్తాడు.