Numerology prediction 20th October 2022 : న్యూమరాలజీ ప్రకారం అక్టోబరు 20 గురువారం రోజు....ఏఏ తేదీల్లో పుట్టినవారికి ఎలా ఉంటుందో.... ఫలితాలు తెలుసుకుందాం...
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
అసంపూర్ణంగా ఉండిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. వివాహితులు ఈ రోజు చిన్నచిన్న విషయాలకే గొడవ పెట్టుకుంటారు. మాటతీరు మార్చుకుంటే మీకే మంచిది. లక్కీ నంబర్ 5, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ.
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
ఆస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన మీకు మంచి ఫలితాలనిస్తుంది. ఈ రోజు మీరు ఓ షాకింగ్ న్యూస్ వింటారు. పిల్లలతో సంతోష సమయాన్ని గడుపుతారు. మీకున్న పరిచయాలను, శక్తి సామర్థ్యాలను సరైన దిశలో వినియోగించండి. మీ లక్కీ నంబర్ 6, కలిసొచ్చే రంగు ఖాకీ
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారికి మంచి సమయం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఆర్థిక పరంగా సవాళ్లతో నిండి ఉంటుంది. ఆర్థిక పరిస్థికి కూడా కాస్త కష్టంగానే ఉంటుంది. మీ లక్కీ నంబరు 1, మంగళకరమై రంగు లెమన్ ఎల్లో
Also Read: ఈ రాశివారు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి, అక్టోబరు 20 రాశిఫలాలు
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఆరోగ్య పరంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉండదు. కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడతారు. రోజు ప్రారంభంలోనే విసుగ్గా ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి కాస్త ప్రశాంతతని పొందుతారు. కొన్ని ముఖ్యమైన పనులు ఈ రోజు ఆలస్యమవుతాయి.లక్కీ నెంబరు - 2, లక్కీ కలర్ గోల్డెన్
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
ఈ తేదీల్లో పుట్టిన వారు చెడు అలవాట్లతో సమస్యలు కొనితెచ్చుకుంటారు. మీరు పనిచేసే రంగంలో పోటీదారుల నుంచి కఠినమైన సవాల్ ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టిసారించాలి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. మీ లక్కీ నంబర్ 9, శుభకరమైన రంగు తెలుపు
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు ఎంజాయ్ చేస్తారు. స్నేహితులతో సరదా సమయాన్ని గడుపుతారు కానీ ఇది మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. మీ లక్కీ నంబర్ 8, మంగళకరమైన రంగు బూడిద రంగు
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, క్షీరాబ్ది ద్వాదశి - పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ రోజు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబం లేదా సన్నిహితులతో లాంగ్ జర్నీ చేసే అవకాశం ఉంది.మీ మనసంతా పరధ్యానంలో ఉంటుంది. చిన్న చిన్న వివాదాలు తప్పవు. మీ లక్కీ నంబర్ 2, శుభకరమైన రంగు పింక్
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ తేదీల్లో పుట్టిన వారు ఆరోగ్యం, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. కార్యాలయంలో బాస్ తో అనవసర వాదనకు దిగకండి...మీరే నష్టపోతారు. ఉద్యోగులు తమపని తాము చేసుకోవడం మంచిది. మీ లక్కీ నంబర్ 6, కలిసొచ్చే రంగు ఊదా
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ తేదీల్లో పుట్టినవారు ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. అనకున్న పనులు, గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ రోజు పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన రోజు. వచ్చిన మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఖర్చులు తగ్గించండి. దీర్ఘకాలిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. లక్కీ నంబర్ 2, కలిసొచ్చే రంగు ఊదా