రుక్మిణి కోపంగా మాధవ్ కాలర్ పట్టుకుని నా బిడ్డ ఎక్కడ ఉందో చెప్పు అని నిలదిస్తుంది. ఊరందరి ముందు నువ్వు నా భార్యవి అలాంటిది బయట ఆ ఆదిత్యతో ప్రేమగా మాట్లాడి నాతో ఇలా మాట్లాడటం ఏమి బాగోలేదని మాధవ్ అంటాడు.
రుక్మిణి: ఆపు సారు.. దేవి ఎక్కడ ఉందో చెప్పు అప్పటిలా నా బిడ్డకి మళ్ళీ ఏం మాయ మాటలు చెప్పావ్
మాధవ్: మా అమ్మ మీద ఒట్టు వేసి అయిన అబద్ధం చెప్తాను ఏమో కానీ నీ మీద ఒట్టేసి చెప్పను, ఈ ప్రపంచంలో నాకిష్టమైన వ్యక్తి అంటే అది నువ్వే నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా దేవి విషయం నాకు తెలియదు
ఆ మాటకి రుక్మిణి కోపంగా వెళ్ళిపోతుంది. ఇటు ఆదిత్య దేవికి ఈరోజే నిజం చెప్పి తనని తీసుకొచ్చుకోవాలి అని అనుకుంటాడు. ఆదిత్య బయటకి వెళ్లబోతుంటే రాజమ్మ పలకరిస్తుంది. ఎప్పుడు నువ్వే ప్రాణంగా బతికే అక్క నీ వల్ల బాధపడుతుంది, నువ్వంటే పిచ్చిగా ప్రేమించే సత్య నీ వల్ల బాధపడుతుంది. నీలో ఈ మార్పు ఎందుకో అర్థం కాక అల్లాడిపోతున్నారు. నీ జీవితంలోకి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు ఒకరు వెళ్లిపోయారు మళ్ళీ ఏ ఆడది వచ్చి చిచ్చు పెడుతుందో అని భయమేస్తుందని రాజమ్మ బాధగా అంటుంది. ఆదిత్య మౌనంగా విని వెళ్ళిపోతాడు. రుక్మిణి దేవి కోసం ఊరంతా గాలిస్తుంది.
Also Read: గతం మర్చిపోయిన మోనిత -వంటలక్కకి సెక్యూరిటీ, అస్సలు ఊహించని షాకిచ్చిన కార్తీక్
కారులో దేవుడమ్మ, సత్య గుడి నుంచి వస్తూ ఉంటారు. సత్య ఆదిత్య మాటలు గుర్తు cఏసుకుని బాధపడుతుంది. దేవదుఅమ్మ వాళ్ళు ఉన్న కారు రుక్మిణి వైపే రావడం సత్య గమనిస్తుంది. అక్క ఇక్కడ ఉంది అంటే ఆదిత్య కోసమే అయ్యి ఉంటుందని సత్య అపార్థం చేసుకుంటుంది. రుక్మిణిని దాటుకుని కారు వెళ్ళిపోతుంది. తర్వాత రుక్మిణి కారు చూసి పెనిమిటి కారు కదా ఆపి నాతో మాట్లాడకుండా వెళ్తున్నాడు ఏంటి నా మీద ఇంకా కోపంగా ఉన్నాడా అని ఆలోచిస్తుంది. ఇంట్లో చిన్మయి, జానకి, రామూర్తి దేవి కోసం చాలా బాధపడుతూ ఉంటారు. దేవుడమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఆదిత్య ఎదురుగా ఉంటాడు. రామూర్తికి ఫోన్ చేసి ఇవ్వమని దేవుడమ్మ అడుగుతుంది. దేవి కనిపించడం లేదని రామూర్తి చెప్తాడు. అప్పుడే విషయం ఆదిత్యకి కూడా తెలుస్తుంది. నీకు ఈ విషయం చెప్పి పోలీసులతో వెతికించమన్నారు అని చెప్తుంది. ఆదిత్య కంగారుగా వెళ్ళిపోతాడు.
అక్కడికి వెళ్ళడానికి కారణం దొరికింది వెళ్లిపోయాడని సత్య బాధపడుతుంది. ఇక ఆదిత్య కారులో వెళ్తు దేవి కోసం వెతుకుతూ ఉంటాడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేసి దేవిని వెతకమని చెప్తాడు. రుక్మిణికి ఫోన్ చేసి నా కూతురు కనిపించకుండా పోయిందని నాకు ఎందుకు చెప్పలేదని ఆదిత్య అరుస్తాడు. అటు మాధవ్ కూడా దేవి ఎందుకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తాడు. అప్పుడే సత్య మాధవ్ కి ఫోన్ చేస్తుంది. దేవి కనిపించడం లేదంటున్నారు నిజమేనా అని అడుగుతుంది. అవును నిన్నటి నుంచి కనిపించడం లేదని చెప్తాడు. మీ అమ్మాయి కనిపించడం లేదంటే మా ఆదిత్య కంగారుగా వెళ్లిపోయాడని సత్య కోపంగా అరుస్తుంది.
Also Read: రిషిధారని విడగొట్టేందుకు దేవయాని నయా స్కెచ్, జగతి -మహేంద్ర-గౌతమ్ ఏం చేయబోతున్నారు!