PM Modi Japan Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జపాన్‌లో ఘన స్వాగతం లభించింది. క్వాడ్ లీడర్స్ సదస్సులో పాల్గొనడానికి ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ సోమవారం తెల్లవారుజామున జపాన్ రాజధాని టోక్యో చేరుకున్నారు. టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోధీకి ఘన స్వాగతం లభించింది. భారత్ మా కా షేర్ (భారతదేశ సింహం) అంటూ టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో ప్రవాస భారతీయులు గట్టిగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. 


ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌కు వెళ్లారు. నేటి నుంచి దాదాపు 40 గంటల పాటు ఆయన జపాన్‌లో ఉంటారు. ఆ సమయంలో 23 కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్లొనేందుకు జపాన్‌ వెళ్లిన ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలతో సమావేశం కానున్నారు. వీరితో పాటు పలు అగ్ర సంస్థల వ్యాపారవేత్తలు, భారత సంతతికి చెందిన ప్రజలతోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. 






జపాన్‌కు వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలకడం తమకు చాలా సంతోషంగా ఉందని, ఆయన శక్తి సామర్థ్యాలతో భారతీయుల్ని ప్రతిచోటా గర్వించేలా చేశారని అక్కడున్న ప్రవాస భారతీయులు అన్నారు. ప్రధాని మోదీకి భారత సంప్రదాయంలో స్వాగతం పలికారు మహిళలు. ఆయనకు స్వాగతం పలికే అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. 






జపనీస్‌లో ప్రధాని మోదీ ట్వీట్
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ టోక్యో చేరుకున్న అనంతరం జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో ట్వీట్ చేశారు. జపాన్‌లోని భారతీయులు తమ మూలాలను కొనసాగిస్తూ పలు రంగాల్లోరాణిస్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా తనకు సాదర స్వాగతం పలికినందుకు ప్రవాస భారతీయులకు జపనీస్ భాషలో ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి తాను జపాన్ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నానని మరో ట్వీట్ చేశారు. మౌలిక వసతులు, టెక్నాలజీ, స్టార్టప్స్ లాంటి ఎన్నో రంగాలలో భారత్‌కు జపాన్ సహకారం అందిస్తుందని చెప్పారు.


Also Read: PM Modi: థామస్ కప్ గెలిచిన టీంతో ప్రధాని చిట్‌చాట్- దేశం గర్వపడేలా చేశారని కితాబు


Also Read: PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు