PM Modi: థామస్ కప్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ జట్టుతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఈ కప్ గెలిచి చరిత్ర సృష్టించడంపై స్వయంగా కలిసి అభినందించారు. అంతర్జాతీయ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి దేశాన్ని గర్వపడేలా చేశారంటూ వారిపై ప్రశంసలు కురిపించారు.
ప్రత్యేకంగా
కప్ గెలిచిన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన బాడ్మింటన్ టీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ప్రధాని ఆటగాళ్లందరితో గంటకుపైగా సరదాగా మాట్లాడారు. జట్టుకు నాయకత్వం వహించిన కిదాంబి శ్రీకాంత్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
తొలిసారి
73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో తొలిసారి భారత్ కప్ అందుకుంది. సింగిల్స్, డబుల్స్‌లో అద్భుతంగా రాణించిన భారత్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండోనేసియాపై 3-0తో గ్రాండ్ విక్టరీ సాధించింది. థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారత ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది.
Also Read: UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి
Also Read: Sidhu Skipped Dinner: జైలులో డిన్నర్ చేయని సిద్ధూ- ఖైదీ నంబర్ ఎంతో తెలుసా?