ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌కు పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ రిప్లై ఇచ్చారు. భారత్‌తో శాంతి, పరస్పర సహకార బంధాన్నే పాక్ కోరుకుంటోందని ఆయన అన్నారు.
శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. భారత్‌తో శాంతియుతమైన, పరస్పర సహకార సంబంధాలనే పాకిస్థాన్ కోరుకుంటోంది. జమ్ముకశ్మీర్ సహా ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుందాం. ఉగ్రవాద వ్యతిరేక పోరులో పాకిస్థాన్ చేసిన త్యాగాలు అందిరికీ తెలుసు. ఇరు దేశాల ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడదాం. - షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ ప్రధాని
పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సుస్థిరతలను భారత్ కోరుకుంటోందని మోదీ ట్వీట్ చేశారు.
" పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన మహమ్మద్ షెహబాజ్ షరీఫ్‌కు శుభాకాంక్షలు. ఉగ్రవాద రహితమైన ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను భారత్ కోరుకుంటోంది. అప్పుడే మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టి పెట్టగలం. ఇదే మన ప్రజలకు శ్రేయస్కరం. "
- ప్రధాని నరేంద్ర మోదీ
ఏకగ్రీవంగా
పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానిని ఎన్నుకునేందుకు నేషనల్ అసెంబ్లీ సోమవారం సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి పీటీఐ సభ్యులందరూ వాకౌట్ చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
Also Read: Modi Congratulates New Pak PM: పాకిస్థాన్ ప్రధానికి తనదైన స్టైల్‌లో మోదీ శుభాకాంక్షలు