ఉక్రెయిన్‌పై దాదాపు 40 రోజులుగా రష్యా యుద్ధం చేస్తోంది. కానీ ఇప్పటివరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను అధీనంలోకి తీసుకోలేకపోయాయి రష్యా బలగాలు. మరోవైపు ఉక్రెయిన్ మాత్రం రష్యాను యుద్ధ భూమిలో దీటుగా ఎదుర్కొంటూనే అంతర్జాతీయ వేదికలపై ఆ దేశానిదే తప్పని నిరూపిస్తోంది. ఉక్రెయిన్‌ని అధినంలోకి తెచ్చుకునే క్రమంలో రష్యా యుద్ధ నేరాలకు, అత్యాచారాలకు పాల్పడుతోందని ఐరాస భద్రతా మండలిలో ఉక్రెయిన్ మానవ హక్కుల సంఘం తాజాగా ఆరోపించింది.


అత్యాచారాలు


రష్యా బలగాలు అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని ఉక్రెయిన్ మానవ హక్కుల సంఘం ఆరోపించింది. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు లైంగిక దాడులు, అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు వస్తున్నాయని యూఎన్‌ అధికారి భద్రతా మండలికి తెలిపారు.


ఉక్రెయిన్‌ మానవహక్కుల సంఘం నాయకురాలు కాటెరినా చెరెపాఖా రష్యా సైనికులు తొమ్మిది మందిపై అత్యాచారం కేసులు ఉన్నాయని, సుమారు 12 మంది మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని భద్రతా మండలిలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు ఇప్పుడూ హింస, అత్యాచారాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అన్నారు. తమ ఆవేదనను వినాలని అభ్యర్థించారు.


అయితే ఉక్రెయిన్‌ దళాలపై కూడా లైంగిక ఆరోపణలు వస్తున్నట్లు యూఎన్‌ పేర్కొంది. కానీ దానిపై ఉక్రెయిన్‌ మానవ హక్కుల సంఘం ఇంకా స్పందించలేదు.


రష్యా స్పందన


మరోవైపు రష్యా ఎప్పటికీ పౌరులపై దాడి చేయదని కేవలం రష్యన్‌ సైనికులను శాడిస్టులుగా చూపించాలనే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నాయని రష్యా యూఎన్‌ రాయబారి డిమిత్రి పోలియన్స్కీ అన్నారు.


టార్గెట్ 


రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియెట్ యూనియన్ విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 9న విజయోత్సవాలను నిర్వహిస్తారు. రష్యాలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ రోజుకు ముందే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గెలవాలని పుతిన్ యోచిస్తున్నారు. ఇందుకోసమే ఉక్రెయిన్‌లో రష్యా మిలిటరీ కాంపెయిన్ థియేటర్ కమాండర్‌గా అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌ను పుతిన్ నియమించినట్లు తెలుస్తోంది


ఈ విధంగా గడువును పొడిగించడం వల్ల రష్యా దళాలు తప్పులు చేసే అవకాశం ఉందని, అదే సమయంలో మరిన్ని దురాగతాలకు పాల్పడే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 


Also Read: Pakistan Political Crisis: పాకిస్థాన్ కొత్త ప్రధాని ముందు 3 సవాళ్లు- 'కశ్మీర్' సమస్యకు పరిష్కారం దొరికేనా?


Also Read: Modi Congratulates New Pak PM: పాకిస్థాన్ ప్రధానికి తనదైన స్టైల్‌లో మోదీ శుభాకాంక్షలు