Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది మృతి! వారి స్థావరం ఎక్కడుంది..

Masood Azhar Family Killed: జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థాపకుడు మసూద్ అజహర్ కుటుంబసభ్యులు ఆపరేషన్ సిందూర్ దాడులతో చనిపోయారని సమాచారం. జేషే మహ్మద్ వర్గాలు ఇదే మాట చెబుతున్నాయి.

Continues below advertisement

Masood Azhar's Family Members Killed |  పహెల్గాం లో జరిగిన ఉగ్రవాదికి భారత్ రెండు వారాల తరువాత ప్రతీకారం తీర్చుకుంది. భారతదేశం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. మంగళవారం అర్ధరాత్రి తరువాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 జేషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి నాశనం చేశాయి. భారత బలగాలు టార్గెట్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చాయని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.  భారత్ చేపట్టిన ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

Continues below advertisement

భారత బలగాలు చేపట్టిన ఈ చర్యకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ దాడిలో జేషే మమ్మద్ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్  అజహర్ కుటుంబం మొత్తం చనిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదుల స్థావరాలతో వారి నివాస ప్రాంతాలపై సైతం భారత బలగాలు 25 నిమిషాలపాటు మెరుపు దాడులు చేయగా మసూద్ కుటుంబంలో 14 మంది వరకు చనిపోయారని రిపోర్టులు చెబుతున్నాయి. Bahawalpurలోని ఉగ్ర స్థావరంపై దాడి చేయగా మసూద్ ఫ్యామిలీ చనిపోయినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఆ సమయలో మసూద్ అక్కడ లేడని జేషే వర్గాల సమాచారం.

అనేక దాడులు చేసిన మసూద్
మసూద్ అజహర్ జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అగ్రేత. ఈ ఉగ్ర సంస్థ భారతదేశంలో పలు ఉగ్రదాడులకు పాల్పడింది. వీటిలో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీటికి భారతదేశం ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. బహవల్పూర్ లోని స్థావరాలపై జరిగిన దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.

మసూద్ అజహర్ కు ఎంతమంది సోదరులు..

మసూద్ అజహర్ భార్య పేరు షాజియా, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మసూద్ అజహర్ కు మొత్తం 5 మంది సోదరులు,  ఆరుగురు సోదరీమణులు ఉన్నారు. ఉగ్రవాది మసూద్ పెద్ద సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ , రెండవ సోదరుని పేరు ఇబ్రహీం అజహర్. వీరితో పాటు సోదరులు అబ్దుల్ రౌఫ్, తల్హా సైఫ్, మహమ్మద్ అమ్మర్ పేర్లు ఉన్నారు. మసూద్ అందరు సోదరులు ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటారు. వీరికి సంతానం చాలా మంది ఉన్నారు. వారికి ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో శిక్షణ ఇస్తున్నారు.

సోదరీమణుల విషయానికి వస్తే, మసూద్ అజహర్ ఒక సోదరి జహ్రా బీవి, ఆమె భర్త పేరు హాఫిజ్ జమీల్. రెండవ సోదరి అబ్దా బీవి, భర్త పేరు మహమ్మద్ తయ్యూబ్. మూడో సోదరి పేరు రాబియా బీవి, ఆమె భర్త అబ్దుల్ రషీద్. ఈ అన్ని సోదరీమణుల భర్తలు కూడా ఉగ్రవాదులు. మొత్తంగా చెప్పాలంటే వీరిది ఉగ్రవాదుల కుటుంబం. భారత్ లో జరిగిన ఎన్నో దాడుల్లో జైషే మహ్మద్ గ్రూప్ హస్తం ఉంది. నేరుగా ఆ గ్రూప్ ఉగ్రవాదులు భారత్‌లో పలుమార్లు ఉగ్రదాడులకు పాల్పడటంతో దీనిని నిషేధిత ఉగ్రవాద సంస్థగా పలు దేశాలు ప్రకటించాయి. పాక్ ఉగ్రవాదులకు స్వర్గదామం కావడంతో ఆ ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాటు చేపడుతుంటారు.

Continues below advertisement
Sponsored Links by Taboola