న్యూఢిల్లీ: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి హేయమైనదని.. ఆ దాడిలో 25 మంది భారతీయులు, ఓ నేపాల్ టూరిస్ట్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ముంబై దాడులు, పుల్వామా ఉగ్రదాడి తరువాత ఇది అత్యంత పెద్ద ఉగ్రదాడి అని విదేశాంగ కార్యదర్శి అన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత భూభాగంలోకి వచ్చి మరి దాడులు చేసి 350 మందికి పైగా అమాయకుల ప్రాణాలు తీసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టి అపరేషన్ సిందూర్ వివరాలను ఆర్మీ అధికారులు, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వెల్లడించారు.

Continues below advertisement


విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌లో అశాంతి, అల్లర్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి చేసింది. కశ్మీర్‌లో అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు ప్రజలను భయాందోళనకు గురిచేయాలని ఉగ్రవాదులు కుట్రపన్నారు. పాకిస్తాన్ తమ నియంత్రణ రేఖను దాటి కాశ్మీర్ లో దాడులు జరుపుతోంది. పాకిస్తాన్ ప్రేరేపేత ఉగ్రవాదులకు భారత బలగాలు తమ సత్తా చాటాయి. పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థలను, పలు దేశాలను తప్పుదోవ పట్టించాలని చూస్తోంది. పాక్ ఉగ్రవాడులు సరిహద్దు దాటి వచ్చి దాడులు చేస్తున్నారు. దాంతో భారత్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు చర్చలు చేపట్టింది. 


 



ఆ కుటుంబాల కన్నీళ్లు ఎందరినో కదిలించాయి


పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఎంతో ఆవేదన అనుభవించాయి. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు అతి తగ్గర నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడి చేసింది తామేనని ద రెసిస్టెంట్ ఫ్రంట్ క్లెయిమ్ చేసింది. డిసెంబర్ 2023లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలు భారత్‌లో దాడులకు ప్లాన్ చేస్తున్నాయని పలుమార్లు అంతర్జాతీయంగా గళం విప్పాం. భారత్ పై మరిన్ని దాడులకు పాక్ ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ వారిని, బాధ్యతులపై కఠిన చర్యలు తప్పవు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గదామం. అందుకే పాక్ భూభాగం నుంచి జైషే మహ్మద్, లష్కరే టెర్రరిస్టులు భారత్ మీద ఉగ్రదాడులకు నిరంతరం ప్లాన్ చేస్తున్నారని’ విక్రమ్ మిస్త్రీ అన్నారు.


టీఆర్ఎఫ్ ను నిషేధిత ఉగ్రసంస్థల జాబితా నుంచి తొలగించాలని పాకిస్తాన్ పలుమార్లు కోరింది. ఈ క్రమంలో అదే సంస్థ భారత్ మీద ఉగ్రదాడి చేసే స్థాయికి దాని కార్యకలాపాలు విస్తరించడం నిజం కాదా. భారత్ ప్రతీకార చర్యలు చేపట్టి పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించినట్లు తెలిపారు.



న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత బలగాలు పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాదుల 9 కీలక స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేశాయి. ఏప్రిల్ 22న జరగిన పహాల్గంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఉగ్రవాదుల స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసింది. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో ఏకంగా 176 మంది ప్రాణాలు కోల్పోగా, 600 మంది పైగా గాయపడ్డారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు. ఇందులో ఓ నేపాల్ టూరిస్ట్ ఉన్నారు.