WHO On BA.2: కరోనా వైరస్ థర్డ్ వేవ్‌కు కారణమైన కొవిడ్19 వేరియంట్ ఒమిక్రాన్. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు హెచ్చరికలు చేసింది. దాంతో పలు దేశాలు అప్రమత్తమై ఒమిక్రాన్ వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా, అంత తేలికగా తీసుకోకూడదని డబ్ల్యూహెచ్‌వో మరోసారి హెచ్చిరించింది.
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో పలు దేశాలు కొవిడ్19 ఆంక్షల్ని సడలిస్తున్నాయి. ఒమిక్రాన్ తగ్గుముఖం పట్టడం నిజమేనని, అయితే దాని సబ్ వేరియంట్ బీఏ.2 (Omicron Sub-Variant BA.2) పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.1, బీఏ.1.1, బీఏ.2, బీఏ.3 గుర్తించారు. తాజాగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ విభాగం చీఫ్ మరియా వాన్ కెర్కేవ్ సూచించారు. కరోనా కారణంగా గత వారం 75 వేల మంది చనిపోయారు. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది డబ్ల్యూహెచ్ఓ.
ఒమిక్రాన్ ప్రభావం తక్కువే కానీ, దాని సబ్ వేరియంట్ బీఏ.2 వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉంది. శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ BA.2 వేరియంట్ ప్రభావం అధికంగా ఉండనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలోనూ ఆస్పత్రి చేరికలు, మరణాలు సైతం ఊహించిన దానికన్నా అధికంగా ఉన్నాయి. ఇది కేవలం సాధారణ జలుబు, ఇన్‌ఫ్లయెంజా కాదని, ఈ సమయంలో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్‌గా ఉండాలని వాన్ కెర్కేవ్ సూచించారు.
ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్నాన్ కేసులలో ప్రతి ఐదింట్లో ఒకటి బీఏ.2 వేరియంట్ ద్వారా వ్యాప్తి అయిందని తెలిపారు. తూర్పు యూరప్‌లో ఒమిక్రాన్ ప్రభావం అధికంగా ఉంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని అక్కడి అధికారులు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. అర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, జార్జియా, రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో కొవిడ్ మరణాలు గత రెండు వారాల్లో రెట్టింపు అయ్యాయని డబ్ల్యూహెచ్ఓ యూరప్ రీజనల్ డైరెక్టర్ హాన్స్ క్లుగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Also Read: Corona Variant: కొత్త వేరియంట్ ‘డెల్టాక్రాన్’ ఉనికి నిజమే కావచ్చు, యూకేలో బయటపడుతున్న కేసులు
Also Read: Cardiac Arrest: చల్లని వాతావారణంలో కార్డియాక్ అరెస్టు కలిగే అవకాశం ఎక్కువ, ఎందుకలా?