ప్రపంచంలోనే ప్రధానమైన కమర్షియల్ జంక్షన్, టూరిస్ట్ డెస్టినేషన్, ఎంటర్టైన్మెంట్ హబ్ అయిన టైమ్స్ స్క్వేర్ తెలుగు వారితో నిండిపోయింది. ఎన్టీఆర్ 100వ జన్మదినం సందర్భంగా అమెరికా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ పై ఎన్టీఆర్ చిత్రాలను ప్రదర్శించారు. శ్రీక్రిష్ణుడు, రాజకీయ నాయకుడు సహా భిన్న పాత్రల్లోని ఫోటోలను టైమ్స్ స్క్వేర్‌పై ప్రదర్శించారు. టీడీపీ ఎన్నారై విభాగంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించింది. ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ఎన్టీఆర్‌కు సంబంధించిన విభిన్న చిత్రాలను ఈ ప్రకటన ద్వారా ప్రసారం చేయనున్నారు.
టైమ్స్ స్క్వేర్‌పై ఎన్టీఆర్ ఫోటోల కోసం క్లిక్ చేయండి
టైమ్స్ స్క్వేర్ పై ఈ తెర సైజు 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు. మే 27 అర్ధరాత్రి నుంచి 28 అర్ధరాత్రి వరకు ఏకధాటిగా 24 గంటలపాటు ప్రదర్శితమయ్యేలా ఎన్నారై టీడీపీ - అమెరికా ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎన్నారై టీడీపీ నేత జయరాం కోమటి పర్యవేక్షణలో అమెరికాలోని 28 నగరాల్లో ఉన్న వర్కింగ్ కమిటీ సభ్యులంతా ఈ డిస్‌ప్లే ఏర్పాటు కోసం వివిధ రకాలుగా సహకారం అందించారు.
టైమ్స్ స్క్వేర్‌పై ఎన్టీఆర్ ఫోటోల కోసం క్లిక్ చేయండి
ఎంతో వ్యయ ప్రయాసలతో ఏర్పాటు చేస్తున్న ఈ డిస్‌ప్లే ప్రకటన ద్వారా ఎన్టీఆర్ కీర్తి విదేశాల్లో మరింత ప్రాచుర్యంలోకి రానుందని ఎన్నారై టీడీపీ నేతలు చెప్పారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన విభిన్న చిత్రాలను ప్రకటన ద్వారా ప్రసారం చేయనున్నట్లు వివరించారు. ప్రపంచంలోని ఎన్టీఆర్ అభిమానులంతా దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. టైమ్స్ స్క్వేర్ తెరపై సెకను పాటు ప్రదర్శించినా కూడా భారీగా వసూలు చేస్తుంటారు. అలాంటి టైమ్ స్క్వేర్‌పై ఏకంగా 24 గంటల పాటు ప్రతి నాలుగు నిమిషాలకు ఓ సారి 15 సెకన్ల పాటు ఎన్టీఆర్ డిస్‌ప్లే ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు చెప్పారు.