Nigeria Boat Accident: 


నైజీరియాలో ప్రమాదం..


నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పడవ మునిగిపోయి దాదాపు 103 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులూ ఉన్నారు. పడవ ఓవర్‌లోడ్ అవడం వల్ల నది మధ్యలో బోల్తా పడిపోయింది. రెస్క్యూ టీమ్‌తో పాటు పోలీసులు...గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకూ 100 మందిని గుర్తించి రక్షించినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతైనట్టు తెలుస్తోంది. ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 5 గ్రామాలకు చెందిన ప్రయాణికులున్నారు. క్వారా రాష్ట్రంలోని నదిలో పడవ బోల్తా పడింది. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ స్పందించారు. 


"పడవ మునిగిపోయిన ఘటనలో ఇంకా చాలా మందిని గుర్తించాల్సి ఉంది. ప్రాణాలతో బయట పడిన వాళ్లు ఇంకా ఆ ప్రమాదాన్ని తలుచుకుని భయపడిపోతున్నారు. చాలా మంది తమ బంధువులను పోగొట్టుకున్నారు. రాత్రి ఓ వెడ్డింగ్ పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


- స్థానిక అధికారి






దాదాపు 300 మంది పడవ ఎక్కారని, ఆ బరువుని మోయలేక పడవ బోల్తా పడిందని అధికారులు చెబుతున్నారు. పడవ వెళ్లే క్రమంలో నదిలోని ఓ రాయిని గట్టిగా ఢీకొట్టింది. వెంటనే రెండు ముక్కలైపోయింది. ఫలితంగా అందరూ నీళ్లలో పడిపోయారు. కొందరు గల్లంతయ్యారు. మరి కొంత మంది ప్రాణాలతో పోరాటం చేసి నీళ్లలోనే కన్నుమూశారు. ఇంకా ఎంత మంది నీళ్లలో ఉన్నారనేది తేలడం లేదు ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 


Also Read: Cyclone Biparjoy: పాక్ వైపు కదులుతున్న బిపర్ జాయ్ తుపాను, గుజరాత్ - మహారాష్ట్రలో హై అలర్ట్