భూమిని రెండు ఆస్ట్రాయిడ్స్ వచ్చి ఢీకొడుతున్నాయా.. గ్రహ శకలాల విధ్వంసం భూమిపై ప్రజల ప్రాణాలు ముప్పులో పడిపోతున్నాయా? డైనోసార్ల కాలం నుంచి ఉన్న భయాలే ఇవన్నీ. ఈ భూమి మీద డైనోసార్ల ను తుడిచిపెట్టేసింది గ్రహశకలాలే చాలా మంది నమ్ముతారు. కానీ అవేవీ ఉన్నపళంగా దూసుకొచ్చి జరిగిపోయిన విషయాలు కావు. ఇప్పుడున్న టెక్నాలజీ తో గ్రహశకలాల కదలికలను చాలా వేగంగా లెక్కలు కడుతున్నాం. ఇప్పుడు ఇంతకీ వైరల్ అవుతున్న ఓ వార్త ఏంటంటే.. రెండు ఆస్ట్రాయిడ్స్ భూమి దిశగా దూసుకువస్తున్నాయని.. అర కిలో మీటర్ సైజులో ఉన్న ఆ గ్రహశకలాలు భూమిని ఢీకొడతాయని. ఆస్ట్రాయిడ్స్ వస్తున్న మాట వరకూ నిజం. అయితే అవి భూమి దిశగా..భూమి పక్కగా వాటి మార్గంలో అవి ప్రయాణం చేస్తున్నాయి. 


పక్కగా అంటే ఏ పది కిలో మీటర్లో వందో కాదు.. ఒకటి 31 లక్షల కిలో మీటర్ల దూరం నుంచి మరొకటి 43 లక్షల కిలో మీటర్ల దూరం నుంచి వెళ్తాయి.. వెళ్తున్నాయి. ఇది ఎప్పుడూ జరిగేదే. ఇదనే కాదు మార్స్, జ్యూపిటర్ కి మధ్య ఉండే బెల్ట్ లో చాలా గ్రహశకలాలు ఉంటాయి. అవన్నీ సూర్యుడి చుట్టూ తమ కక్ష్యలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలా రెండు ఆస్ట్రాయిడ్స్ ఇప్పుడు భూమి కి పక్కగా వాటి దారిలో అవి వెళ్తున్నాయి.


వాటిలో మొదటిది 


1. Asteriod 488453(1994XD)


ఇది ఈ నెల 12వ తారీఖున భూమి పక్కగా వెళ్లింది. అది కూడా 31 లక్షల 62 వేల 498 కిలోమీటర్ల దూరం నుంచి ఫ్లై బై అయ్యింది. ఇదిగో ఈ సైజులో 495 మీటర్ల సైజ్ లో ఉంటుంది ఈ గ్రహశకలం. గంటకు 77వేల 400కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్ని మన శాస్త్రవేత్తలు 1994లోనే కనిపెట్టారు.


2. Asteriod 2020 DB5


దీన్ని పేరులో ఉన్నట్లే దీన్ని శాస్త్రవేత్తలు 2020లో కనుగొన్నారు. ఇది భూమి పక్కగా అంటే 43 లక్షల 08 వేల 418 కిలో మీటర్ల దూరం నుంచి జూన్ 15న వెళుతుంది. దీని సైజ్ దాదాపు అర కిలో మీటరు. దీని స్పీడ్ 34 వేల 200 కిలో మీటర్లు.


సో ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్తున్న ఆస్ట్రాయిడ్లను భూమిని ఢీకొడతాయి.. భూగోళం బద్దలైపోతుంది అని భయపెడుతున్నారు కానీ అవేమీ వాస్తవం కాదు. పైగా సైజ్ తక్కువగా ఆస్ట్రాయిడ్స్ భూమి కక్ష్యలోకి వచ్చినా అవి కరిగిపోతాయి. ఇప్పుడు ఈ రెండు ఆస్ట్రాయిడ్స్ ను నాసా పొటిన్షెయల్లీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్ గానే గుర్తించింది కానీ భయం లేదు. నాసా ఇటీవలే ఓ టెక్నాలజీని కూడా డెవలప్ చేసింది. డార్ట్ మిషన్ లాంటి ప్రయోగాలతో ఎక్కడో సుదూరంలో ఉన్న డైమోర్ఫస్ ఆస్ట్రాయిడ్ ను వేగంగా ఢీకొట్టింది. సో రేపు ఎప్పుడైనా ఎలాంటి ఆస్ట్రాయిడ్స్ పొరపాటును భూమి కక్ష్యలోకి వచ్చే అవకాశం ఉందని తెలిసినా..కొన్ని లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్నప్పుడే వాటిని గుర్తించి అక్కడే బద్ధలు కొట్టేయగల టెక్నాలజీ మనుషుల దగ్గర ఉంది. సో డోంట్ వర్రీ.