New Zealand Earthquake: న్యూజిలాండ్‌ లోని కెర్మాడెక్ దీవుల్లో భూకంపం సంభవించింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతు వరకూ ఈ ప్రభావం కనిపించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.11 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 7.2 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చింది. అయితే.. దీని వల్ల న్యూజిలాండ్ కు ఎలాంటి ప్రమాదం లేదని నేషనల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (National Emergency Management Agency) చెప్పింది. అంతేకాకుండా మళ్లీ భూకంపం వచ్చే అవకాశం కూడా తక్కువేనని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మోలజీ (National Centre for Seismology) ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అలాగే సముద్రానికి దగ్గరగా ఉండే ప్రజలను వెంటనే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. పసిఫిక్, ఆస్ట్రేలియన్ టెక్టానిక్ ప్లేట్స్ ప్రాంతంలో ఉండే న్యూజిలాండ్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. సెసిమిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ద్వీపంలో ఇప్పటికే చాలా సార్లు భూమి కంపించింది. 










గత నెల కూడా న్యూజిలాండ్ లో భూకంపం


న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతు వరకూ ఈ ప్రభావం కనిపించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 మ్యాగ్నిట్యూడ్ నమోదైంది. ఇప్పటికే అక్కడ సునామీ వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ వెల్లడించింది. Kermadec Islands ప్రాంతంలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే..సునామీ వస్తున్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ స్పందించింది. అలాంటి ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మోలజీ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. పసిఫిక్, ఆస్ట్రేలియన్ టెక్టానిక్ ప్లేట్స్ ప్రాంతంలో ఉండే న్యూజిలాండ్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. సెసిమిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ద్వీపంలో ఇప్పటికే చాలా సార్లు భూమి కంపించింది. టర్కీ, సిరియాలోనూ ఇటీవల భారీ భూకంపాలు నమోదయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌ ఆ రెండు దేశాలకూ అండగా నిలిచింది.