Twitter Blue Tick:



ఉచితంగా బ్లూ టిక్ 


ట్విటర్‌లో మరోసారి టెక్నికల్ గ్లిచ్ వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా యూజర్స్‌ని షాక్‌కి గురి చేసింది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరవాత ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్లూ టిక్ కావాలంటే నెలవారీగా డబ్బు చెల్లించాల్సిందే అని కండీషన్ పెట్టాడు. అప్పటి నుంచి చాలా మంది డబ్బు కట్టి బ్లూ టిక్ తీసుకుంటున్నారు. కానీ...టెక్నికల్ గ్లిచ్ కారణంగా కొంత మందికి ఫ్రీగానే బ్లూటిక్ వచ్చేస్తోంది. మిలియన్ ఫాలోవర్‌ల కన్నా ఎక్కువ మంది ఉన్న వారికి ఉచితంగానే బ్లూ టిక్ కనిపిస్తోంది. ట్విటర్ కావాలనే ఈ నిర్ణయం తీసుకుందా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పది లక్షలకు మించి ఫాలోవర్‌లు ఉన్న వారికి ఉచితంగానే ఈ బ్లూ టిక్ ఇస్తోందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కానీ ఇది కచ్చితంగా టెక్నికల్ ఫెయిల్యూరే అని కొందరు తేల్చి చెబుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడో చనిపోయిన ట్విటర్ యూజర్స్‌ అకౌంట్‌లకు కూడా బ్లూ టిక్ కనిపిస్తోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పూత్ సింగ్, సిద్దార్థ శుక్లా లాంటి ప్రముఖుల అకౌంట్‌లలో ఇదే జరిగింది. అసలు చనిపోయిన వ్యక్తి అకౌంట్‌ల నుంచి బ్లూటిక్ రిక్వెస్ట్ ఎలా వెళ్లిందన్నదే విచిత్రంగా ఉంది. కొందరు ఈ అకౌంట్‌లు హ్యాక్ చేసి కావాలనే ఇదంతా చేస్తున్నారా అని నెటిజన్లు ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఉచితంగా బ్లూ టిక్‌ ఉన్న అందరి ప్రముఖుల అకౌంట్‌ల నుంచి ఆ ఫీచర్‌ని తొలగించింది ట్విటర్. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా చాలా మంది నటులు, రాజకీయ ప్రముఖుల అకౌంట్‌లలో బ్లూ టిక్ కనిపించకుండా పోయింది. ఇప్పుడు బ్లూ టిక్ కావాలంటే నెలకు రూ. 650 చెల్లించాలి. IOS యూజర్స్ అయితే నెలకు రూ.900 కట్టాలి. 






ఇవీ ధరలు..


ట్విట్టర్ వెరిఫికేషన్ బ్లూ టిక్ కోసం పలు రకాల సబ్ స్ర్కిప్షన్ ఫ్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది.  వెబ్ బ్రౌజర్ ద్వారా సైన్ అప్ చేసే వినియోగదారులు ట్విట్టర్  బ్లూ టిక్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నెలకు 7 అమెరికన్ డాలర్లు చెల్లించాలి.  iOS లేదా ఆండ్రాయిడ్ లో ట్విట్టర్ ని ఉపయోగించినట్లైతే నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత్ లో అయితే, Ios,  Android  వినియోగదారులు ట్విట్టర్ బ్లూ టిక్ కోసం నెలకు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వెబ్ క్లయింట్స్ అయితే రూ. 650 ఇవ్వాల్సి ఉంటుంది. అటు ఏడాదికి గాను బ్లూటిక్ కోసం రూ. 6,500 ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. ఇక భారత్ లో చాలా మంది ప్రముఖులు తమ అకౌంట్స్ కు బ్లూ టిక్ ను కోల్పోయారు.  బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా తమ బ్లూ వెరిఫైడ్ టిక్‌లను కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఈ జాబితాలో ఉన్నారు. క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైతం ట్విట్టర్ బ్లూటిక్ తొలిగింపు లిస్టులో చేరారు.