‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన చలాకీ చంటి శనివారం తీవ్ర అస్వస్థకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. గుండెనొప్పికి గురైన చంటిని హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం చంటిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇది ఎంత వరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది.
‘జబర్దస్త్’ కామెడీ షోతో చంటీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు రావడంతో మధ్యలో ‘జబర్దస్త్’ షోను విడిచిపెట్టినా.. అప్పుడప్పుడు కనిపించేవాడు. అంతేకాదు, ఈటీవీ ప్లస్‌లో ప్రసారమైన ‘నా షో నా ఇష్టం’ షోకు యాంకర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ సీజన్-6లో ప్రత్యక్షమయ్యాడు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులు కొట్టేసినా.. చివరి వరకు నిలవలేకపోయాడు. అయితే, ఇటీవల చంటి సినిమాల్లో గానీ, టీవీ షోస్‌లో గానీ కనిపించడం లేదు. ఇంతలో ఈ వార్త బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసి చంటి అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.