నందిని, గౌతమ్ పెళ్లి చేస్తే నీ కాపురం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించమని రేవతి కంగారుపడుతుంది. ఒక ఆడదానిగా నీ ధైర్యాన్ని మెచ్చుకుంటాను కానీ అత్తగా సమర్ధించను. ఇక చాలు ఇంటికి వెళ్దాం పద వంటింటి కుందేలుగా నేను బంగారు పంజరంలో ఉందుగాని పద అంటుంది. ఏసీపీ సర్ మాట ఇస్తే తప్పుతాడా కన్నతల్లికి కూడా నమ్మకం లేదు కానీ నాకు ఉంది ఆయన ఇప్పుడు సంఘర్షణలో ఉన్నారు. వీటి మధ్య నలిగిపోతున్నారు కానీ ఆయన చివరకు న్యాయం వైపు  మొగ్గు చూపుతారని ధైర్యంగా చెప్తుంది. నీకు తెలియదు కృష్ణ వాడికి పెద్దమ్మ మాట అంటే వేదం వాడు సాయం చేస్తాడని నమ్మకం పెట్టుకోకు. దీని వల్ల మీ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా వస్తాయని చెప్తుంది. దయచేసి నందినిని మర్చిపో కృష్ణ క్షేమంగా ఉండాలంటే ఈ పెళ్లి ఆపకపోవడమే మంచిదని రేవతి గౌతమ్ ని వేడుకుంటుంది. ఆఖరి నిమిషం దాకా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని కృష్ణ అంటుంది.


రేవతి: పరువు కోసం కూతుర్ని పిచ్చి దాన్ని చేసింది ఇక బయట నుంచి వచ్చిన దాన్ని నిన్ను ఏం చేస్తుందో ఆలోచించే పిచ్చిదాన


Also Read: అఖిల్ బాబుకి బారసాల, గొడవ చేసిన జెస్సి - రామని జానకి తీసుకొస్తుందా?


కృష్ణ: మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది. ఈ తింగరి పిల్ల వెనుకడుగు వేయదు వెనక్కి లాగకండి


రేవతి: సరే అన్నింటినీ ఎదుర్కొని గెలిచి రా లేదంటే ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను


మురారీ నందిని మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు. మురారీ డల్ గా ఉండటం చూసి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావని భవానీ అడుగుతుంది. మురారీ పెళ్లి కొడుకు దగ్గరకి వచ్చి మాట్లాడతాడు. మీ ఇంట్లో నందిని ఎక్కువగా మీ మాటే వింటుందట కదా మీరు కూడా మాతో పాటు అమెరికా వచ్చి ట్రీట్మెంట్ అయ్యే దాకా ఉండవచ్చు కదా అని అడుగుతాడు.


పెళ్లికొడుకు తల్లి: పెళ్ళికూతురు వచ్చిందంటే చూడటానికి వెళ్ళాను మొహం మీద తలుపు వేసింది


కిరణ్:మతిస్థిమితం లేదంటే ఏమో అనుకున్నా ఇంత పిచ్చి ఉందనుకోలేదు మేము అడ్జస్ట్ చేసుకుంటాం


మురారీ: పెళ్ళికి ముందు ఇవన్నీ ఆలోచించుకోలేదా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇంకోకసారి ఇలా మాట్లాడితే ఒప్పుకునేదే లేదని వార్నింగ్ ఇస్తాడు. జరుగుతున్న యుద్ధంలో తన కోడలు మాత్రమే గెలవాలని రేవతి దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది. భవానీకి భయపడి గౌతమ్ వెనుకడుగు వేస్తుంటే కృష్ణ ధైర్యం చెప్తుంది. నందినిని బలవంతంగా పెళ్లి మండపానికి తీసుకుని వస్తారు. ఈ పెళ్లి వద్దని నందిని గోల చేస్తుంటే భవానీ కళ్ళతోనే బెదిరిస్తుంది. నందిని చూసి మురారీ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. చెల్లి పెళ్లి అయి అమెరికా వెళ్లిపోతుందని బాధపడుతున్నావా అని భవానీ అంటుంది.


Also Read: విక్రమ్ ఆశ అడియాస అయిపోయిందే- వెళ్ళిపోయిన ప్రేమ్, కంటతడి పెట్టించిన తల్లీకొడుకులు


సరిగ్గా పెళ్లి జరిగే టైమ్ కి గౌతమ్, కృష్ణ పెళ్లి మండపానికి వస్తారు. వాళ్ళని చూసి భవానీ షాక్ అవుతుంది.