జానకి భర్తకి క్యారేజ్ తీసుకుని వస్తే మనోహర్ ఇవ్వడానికి వీల్లేదని అడ్డుపడతాడు. చెప్పేది మర్యాదగా చెప్పొచ్చు కదా అని రామ కోపంగా అనేసరికి మత్తు మందులు అమ్ముకునే చిల్లర గాడివి నోరు లేస్తుంది ఏంటని నైట్ కి ఫుడ్ పెట్టొద్దని ఆర్డర్ వేస్తాడు. రేపు కోర్టులో పప్రొడ్యూస్ చేస్తాం అప్పుడు జైలుకి వెళ్ళి అక్కడ పెట్టుకో గోరుముద్దలు అనేసి అవమానిస్తాడు. పెద్దన్నయ్య ఇప్పట్లో రాడు బారసాల ఆపే ప్రసక్తే లేదని అఖిల్ అన్న మాటలు గురించి జ్ఞానంబ ఆలోచిస్తూ ఉండగా గోవిందరాజులు వచ్చి పలకరిస్తే మొహం తిప్పేసుకుంటుంది. దీంతో చాలా బాధపడతాడు. వెన్నెల వచ్చి ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్తే శాశ్వతంగా నిద్రపట్టే ట్యాబ్లెట్ ఇవ్వమని అంటుంది. అప్పుడే అఖిల్ బారసాలకి కావాల్సిన సరుకులు తీసుకొచ్చి ఇస్తాడు. ఈ ఇంట్లో అన్నయ్య తప్ప మిగతా వాళ్ళకి ఎవరూ నేను కనిపించను నా భార్యతో సహా అని దెప్పిపొడుపు మాటలు అంటాడు.


Also Read: విక్రమ్ ఆశ అడియాస అయిపోయిందే- వెళ్ళిపోయిన ప్రేమ్, కంటతడి పెట్టించిన తల్లీకొడుకులు


ఏం హెల్ప్ చేయమంటావని వెన్నెల వస్తుంది. ఇల్లు డెకరేట్ చేసే వాళ్ళు వస్తారని అంటే మనమే చేసుకోవచ్చు కదా అని వెన్నెల అంటుంది. రేపు బారసాల జరిగే దాకా నమ్మకం లేదు కదా. బారసాలకి పెద్దన్నయ్యని తీసుకురాకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అత్తయ్య జానకిని బెదిరించారు కదా అంటే అది బెదిరింపు కాదు నిజమని జ్ఞానంబ అంటుంది. అప్పుడే జానకి వచ్చి ఆ మాట వింటుంది. రేపు ఎవరు వచ్చినా రాకపోయినా పంతులు వస్తాడు బారసాల జరిగిపోతుంది అది చాలు నాకని అఖిల్ వెళ్ళిపోతాడు. రేపు రామ రాకపోతే ఎలాంటి దారుణం చూడాల్సి వస్తుందోనని గోవిందరాజులు భయపడతాడు. సుగుణ దగ్గర ఫోన్ తీసుకుని రామ జానకికి ఫోన్ చేస్తాడు. బాబుని చూడాలని ఉందని చూపించమని అడుగుతుంది. ఇంట్లో పరిస్థితి బాగోలేదు మిమ్మల్ని విడిపించుకుని రాలేదని నా మీద అలిగారు. రేపు వాడి బారసాల అని చెప్పేసరికి నేను లేకుండానే చేస్తున్నారా అని రామ బాధపడతాడు.


Also Read: అబ్బబ్బ, వాట్ ఏ ట్విస్ట్- రంగంలోకి దిగిన కావ్య, ఇక రాహుల్ కి దబిడి దిబిడే


ఇద్దరూ ఫోన్ మాట్లాడుకుంటూ అన్నం కలిసి తింటారు. మళ్ళీ రామ తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటుంది. మనోహర్ వస్తున్నాడని సుగుణ అనేసరికి రామ కంగారుగా ఫోన్ పెట్టేస్తాడు. ఏదో ఒకటి చేసి రేపు బారసాలకి రామని తీసుకురావాలని జానకి అనుకుంటుంది. జెస్సి అఖిల్ చేస్తున్న దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నప్పుడు చేసుకోవచ్చని చెప్తుంటే అఖిల్ మాత్రం వినడు. ప్రతి మగాడి విజయం వెనుక మాత్రమే కాదు తలనొప్పి వెనుక కూడా ఆడది ఉంటుందని అఖిల్ సీరియస్ అవుతాడు. ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు.