సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం(ఏప్రిల్ 21న) రిలీజ్ అయ్యింది.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్  'విరూపాక్ష' సినిమాను నిర్మించారు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీ తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సినిమా చూసేందుకు థియేటర్ల దగ్గర అభిమానులు పోటెత్తారు. 'విరూపాక్ష' హిట్టు బొమ్మ అంటున్నారు నెటిజనులు. సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం పట్ల మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

  


బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ కావడంతో అభిమానులలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా రెగ్యులర్ కమర్షియల్ కథతో కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకోవడం కూడా సినిమా మీద ఆసక్తి కలిగించింది. మొత్తంగా సినిమా బావుందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ దెబ్బతో సాయికి మళ్లీ మంచి డిమాండ్ పెరగడం ఖాయంగా చెప్తున్నారు.


మేనల్లుడికి చిరు అభినందనలు!


మేనల్లుడి తాజా సినిమా సక్సెస్ కావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. చిరంజీవి సతీమణి సురేఖ సాయి ధరమ్ తేజ్ కు కేక్ తినిపించి శుభాకాంక్షలు చెప్పింది. ‘విరూపాక్ష’కు పాజిటివ్ టాక్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రంతో ఆయన మళ్లీ హిట్ ట్రాక్ లో వెళ్లడం ఆనందంగా ఉందని తెలిపింది.  “’విరూపాక్ష’ గురించి చక్కటి రిపోర్టులు వస్తున్నాయి. నేను వాటిని చూసి చాలా సంతోషంగా ఉన్నాను. సాయి ధరమ్ తేజ్ మంచి సక్సెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చావు. మీ చిత్రాన్ని అందరూ అభినందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నీ సినిమాని ప్రేక్షకులు మెచ్చుకోవడంతో పాటు వారి ఆశీస్సులు అందించడం హ్యాపీ ఉంది.  మీ మొత్తం టీమ్ కు హృదయ పూర్వక అభినందనలు” అని చిరంజీవి ట్వీట్ చేశారు.






పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు


అటు సాయి ధరమ్ తేజ్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘విరూపాక్ష’ సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డియర్ సాయి ధరమ్ తేజ్, ‘విరూపాక్ష’ గ్రాండ్ సక్సెస్ పట్ల హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అంటూ అభినందన లేఖ పంపించారు. 


ధన్యవాదాలు చెప్పిన సాయి ధరమ్ తేజ్


అటు చిరంజీవి, వనన్ కల్యాణ్ అభినందనల పట్ల సాయి ధరమ్ తేజ్ స్పందించారు. “థ్యాంక్యూ అత్తా, మామ. లవ్‌ యూ బోత్” అంటూ రిప్లై ఇచ్చారు.  అటు చిన్నమామ పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు చెప్పారు. ‘విరూపాక్ష’ విడుదల రోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ ప్రేమకు, సపోర్టుకు ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చారు.










Read Also: ఎట్టకేలకు ‘జవాన్’లో అల్లు అర్జున్? పుష్పరాజ్ ఫ్యాన్స్‌కు పూనకాలేనట!