‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అల్లు అర్జున్. టాలీవుడ్ లో సత్తా చాటిన ఈ ఐకాన్ స్టార్, త్వరలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. షారుఖ్ ఖాన్- అట్లీ కాంబోలో తెరెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘జవాన్’తో హిందీ వెండితెరపై దర్శనం ఇవ్వబోతున్నట్లు మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అథితి పాత్రలో బన్నీ మెరవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే బన్నీ ‘జవాన్’ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని వచ్చినట్లు సమాచారం. 


‘జవాన్’ షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్జున్


సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ క్రేజ్ ను యూజ్ చేసుకోవాలని అట్లీ భావిస్తున్నాడు. అల్లు అర్జున్ కు సౌత్ లో ఉన్న ఫాలోయింగ్ ‘జవాన్’ సినిమాకు ఉపయోగపడుతుంది ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఈ సినిమాలో పూర్తి స్థాయి క్యారెక్టర్ కాకుండా కేవలం అతిథి పాత్రకే అల్లు అర్జున్ పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం ‘జవాన్’ సినిమాలో నటించాలని అల్లు అర్జున్ కు ఆఫర్ వచ్చినా, తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అన్నీ అవాస్తవాలుగా మిగిలిపోయినట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం ముంబైలో జరిగిన ‘జవాన్’ షూటింగ్ లో ఆయన పాల్గొన్నారట.


‘జవాన్’ మూవీతో నయనతార, అట్లీ బాలీవుడ్ లోకి ఎంట్రీ


ఇక ‘జవాన్’ చిత్రంలో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో నయన్ కూడా బాలీవుడ్ లోకి తొలిసారి అడుగు పెడుతోంది.  ‘జవాన్’ సినిమాతో దర్శకుడు అట్లీ సైతం బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు.  ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కూడా క్యామియో రోల్ లో మెరవనున్నారు. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ‘జవాన్’ మూవీ జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.


'పుష్ప 2' షూటింగుకు బ్రేకులు!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా  సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'పుష్ప 2'. పాన్ ఇండియా హిట్ 'పుష్ప'కు సీక్వెల్ ఇది. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్, ఫారిన్ ఫైటర్స్, సినిమాలో కీలక తారాగణంతో కొందరి మీద ఫైట్స్ తీస్తున్నారు.  తాజాగా నిర్మాతలతో పాటు దర్శకుడు సుకుమార్ మీద కూడా రైడ్స్ జరుగుతుండటంతో 'పుష్ప 2' చిత్రీకరణను అర్థాంతరంగా ఆపేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.  మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.  






Read Also: అమితాబ్ మనవరాలిపై ఫేక్ న్యూస్ - గూగుల్‌కు న్యాయస్థానం కీలక ఆదేశాలు