రెండు సార్లు వాయిదా పడిన నాసా ఆర్టెమిస్ 1
సాంకేతిక సమస్యలే నాసా సమస్యలకు కారణమా
ఇంజిన్ లో తలెత్తుతున్న సమస్యలతో వాయిదా
గ్రీన్ రన్ టెస్టింగ్ లో బయటపడుతున్న సమస్యలు
సమస్యల పరిష్కారానికి నాసా బృందం ప్రయత్నాలు


Reasons Behind Nasa Artemis Postponement : నాసా సైంటిస్టులకు ఓ క్లారిటీ వచ్చి అంతా ఓకే అనుకున్నంత వరకూ ఆర్టెమిస్ ప్రయోగం చేసేది లేదని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ స్పష్టం చేశారు. వాస్తవానికి నాసా ఆర్టిమెస్ 1 చేపడుతోంది స్పేస్ లాంఛ్ వెహికల్ (SLS) ను టెస్ట్ చేయటానికే. ఎందుకంటే చంద్రుడిపైకి నాసా మనుషులను పంపించి 50 ఏళ్లు దాటేస్తోంది. సో ఇప్పుడు ఉన్నపళంగా మనుషులతోనే ప్రయోగాలు చేసే బదులు ఆర్టెమిస్ 1 లో భాగంగా ఖాళీ రాకెట్ నే అంతరిక్షంలోకి పంపి.. ఓరియన్ క్యాప్సూల్ ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టాలని నాసా భావిస్తోంది. కానీ ఇప్పటికి రెండు సార్లు ఈ ప్రయోగం వాయిదా పడటంతో నాసాను ఇంటర్నేషనల్ మీడియా ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది.  


ఆర్టెమిస్ 1 లో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే :  
ఆర్టెమిస్ 1 లో వాడుతున్న రాకెట్ స్పేస్ లాంఛ్ సిస్టమ్ SLS అంటారు. ఈ రాకెట్ ఉండే ఇంజిన్స్ చాలా హై ఫర్మామెన్స్ మెషీన్స్. ప్రత్యేకించి రాకెట్ కు ఫ్యూయల్ అంటే ఇంధనాన్ని ఎక్కించేప్పుడు వీటిని అత్యధిక ఉష్ణోగ్రతలకు, అతి తక్కువ ఉష్ణోగ్రతలకు లోనయ్యేలా కావాలనే చేస్తారు. లాంఛ్ సమయంలో దాదాపు ఏడు లక్షల గ్యాలన్ల లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ లను ఈ SLS కోర్ స్టేజ్ లో ఉన్న ట్యాంకుల నుంచి రాకెట్ కు అనుసంధానమై ఉన్న నాలుగు RS 25 ఇంజిన్లకు పంపిస్తారు. అది కూడా కన్సిస్టెంట్ టెంపరేచర్స్ అండ్ ప్రెజర్ లోనే వెళ్లేలా జాగ్రత్తలు తీసుుకంటారు. లిక్విడ్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజిన్స్ కు వెళ్లేప్పుడు అక్కడ దాదాపు మైనస్ 423 డిగ్రీ ఫారన్ హీట్.... లిక్విడ్ ఆక్సిజన్ ఇంజిన్స్ కు ఎక్కించేప్పుడు మైనస్ 297 డిగ్రీస్ ఫారన్ హీట్ టెంపరేచర్ ఉండేలా చేస్తారు. దీన్నే గ్రీన్ రన్ టెస్టింగ్ అంటారు. ఒక వేళ ఈ గ్రీన్ రన్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఫ్యూయల్ లీకేజ్ గనుక ఉంటే వెంటనే ప్రయోగాన్ని వాయిదా వేసి ఆ లీకేజ్ ను అరికట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. 






ఇంజిన్స్ లోకి ఫ్యుయల్ సప్లై జరగాలి, కానీ ! 
రాకెట్ ప్రయోగానికి ముందే ఈ ఇంజిన్స్ లోకి ఫ్యుయల్ సప్లై జరగాలి కాబట్టి చివరి నిమిషం వరకూ ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేసేందుకు ఇంజినీర్లకు వీలుండదు. ఇంధనం ఖర్చు, వాళ్లకున్న పరిమితుల దృష్ట్యా టెస్ట్ ట్రయల్స్ కూడా చేయలేరు. కొన్ని సార్లు ఫ్యూయల్ లీకేజ్ ఇంజిన్ లోకి పంపినప్పుడు లేకపోయినా తర్వాత బరస్ట్ అవుట్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. అదే కదా రాకెట్ లు కూలిపోవటానికి, పేలిపోవటానికి కారణాలుగా మిగిలేవి. సో ఈ ప్రొసీజర్ ని ఇప్పుడున్న ఇంతకంటే ఆక్యూరేట్ గా చేయలేరు. స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు భారీ ఫండిగ్స్ తో ఆల్టర్నేటివ్ ప్లాన్స్ గురించి పరిశోధనలు చేస్తున్నాయి కానీ నాసా, ఇస్రో లాంటి సంస్థలకు ఆయా ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్ లిమిటెడ్ కనుక అంతకు మించి ముందుకు పోలేవు. సో ఈ బ్లీడింగ్ రెండు సార్లు ఆర్టెమిస్ వాయిదా పడటానికి కారణం.
Also Read: NASA Artemis-1 : ఆర్టెమిస్ మళ్లీ మిస్, ఇంధన లీకేజీతో రెండోసారి వాయిదా


Also Read: NASA Feels ISRO Strong Competitor: ఇండియా చంద్రుడి మీద చేసిన ప్రయోగాలనే నాసా దాటాలనుకుంటుందా ?