ఏటా మే 1- నుంచి మే 5వరకూ బ్లాక్ హోల్ వీక్ గా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరుపుతోంది. అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏంటీ..? ఇప్పటివరకూ అవి మిస్టీరియస్ గా ఎందుకు ఉన్నాయి. టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నా మనిషి బ్లాక్ హోల్స్ కాన్సెప్ట్ ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ అవేర్ నెస్ కల్పిస్తోంది నాసా. ఈ కథనంలో బ్లాక్ హోల్స్ సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం.
1.
బ్లాక్ హోల్స్ కాన్సెప్ట్ ఈ విశ్వంలో అర్థం చేసుకునేందుకు సంక్షిష్టంగా ఉండే.. శాస్త్రవేత్తల్లో చాలా ఆసక్తిని కలిగించే విషయం. వాటి గురించి చాలా తెలుసుకోవాలని మన శాస్త్రవేత్తలు ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఓ పెద్ద ప్రాబ్లం ఏంటంటే..బ్లాక్ హోల్స్ కంటికి కనపడవు. బ్లాక్ హోల్స్ నుంచి ఎలాంటి కాంతి రాదు కాబట్టి అవి ఇంత పెద్ద విశ్వంలో ఎక్కడున్నాయి అని ఎగ్జాట్ గా కనుక్కోవటం చాలా చాలా కష్టం. అయితే బాగా అబ్జర్వ్ చేస్తే బ్లాక్ హోల్స్ కారణంగా ఈ విశ్వంలో జరిగే కొన్ని అంశాలు...వాటి ఎగ్జిస్టెన్స్ ని తెలియ చేస్తున్నాయి.
2.
ఆకాశంలో రాత్రి పూట మనం రోజూ చూసే నక్షత్రాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి కదా. అలా ఏ టెలిస్కోప్ తోనో ఇంకా దూరంగా ఇంకా దూరంగా ఉండే నక్షత్రాలను గమనించుకుంటూ వెళ్లామనుకోండి. ఓ పర్టిక్యులర్ ప్లేస్ లో ఉన్న నక్షత్రాలు చాలా అంటే చాలా వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ఎంత వేగం అంటే గంటకు కోటి మైళ్ల వేగంతో. ఊహించుకోవటానికి భయంగా ఉంది కదా. అంత స్పీడ్ తో అసలు నక్షత్రాలు కదిలిపోవటానికి అసలు అక్కడ స్టార్స్ ని ఏం ఇన్ ఫ్లుయెన్స్ చేస్తోందని అబ్జర్వ్ చేస్తున్న శాస్త్రవేత్తలకు తేలింది ఏంటంటే..అక్కడ ఏం కనిపించట్లేదు కానీ ఏదో ఉంది. దానికి బ్లాక్ హోల్ అని పేరు పెట్టారు. తెలుగులో కృష్ణ బిలం అంటారు.
3.
బ్లాక్ హోల్ మన సౌరకుటుంబం ఉన్న పాలపుంతకు ఎగ్జాట్ గా సెంటర్ లో ఉన్నట్లు భావిస్తే ఈ పాలపుంత అంతా ఓ స్పైరల్ డిస్క్ లా బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్నందన్న మాట. 2020లో ముగ్గురు ఆస్ట్రో ఫిజిసిస్ట్లు ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ ను అందుకున్నారు. బ్లాక్ హోల్స్ డార్క్ సీక్రెట్ మీద వాళ్లు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఏదో కంటికి కనిపించని ఓ భారీ ఆకారం ఈ పాలపుంతను తన చుట్టూ తిప్పుకుంటోంది. ఆ బిలం బరువు దాదాపుగా మన సూర్యుడి కంటే నలభై లక్షల రెట్లు ఎక్కువ అని.
4.
కేవలం మన గెలాక్సీకే కాదు చాలా గెలాక్సీలకు ఇలాంటి బ్లాక్స్ హోల్స్ ఉన్నాయి. చాలా గెలాక్సీలు మన బ్లాక్ హోల్ కంటే పెద్ద బ్లాక్ హోల్స్ చుట్టూ తిరుగుతున్నాయి. బ్లాక్ హోల్ నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు కాబట్టి అవి కనిపించటం లేదు. దేనినైనా తనలోకి లాగేసుకోగల శక్తి వాటికున్న దాని గ్రావిటీని తప్పించుకోవటానికి దాని చుట్టూ ఉన్న నక్షత్రాలు అంత వేగంగా తిరుగుతున్నాయి. పిల్లికి ఎలుకకు జరిగే పోరాటం. కొన్ని నక్షత్రాలు వందల వేల లక్షల సంవత్సరాలకు వాటిలోని శక్తి అయిపోయి బ్లాక్ హోల్ లోకి జారిపోతున్నాయి.
5.
2019లో తొలిసారిగా ఆస్ట్రోనామర్స్ M87 అనే గెలాక్సీ బ్లాక్ హోల్ ను ఫోటో తీశారు. అది మన గెలాక్సీ నుంచి 55 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ ఫోటోలో కూడా మనకు బ్లాక్ హోల్ క్లియర్ గా కనిపించటం లేదు..దాని చుట్టూ ఉన్న కాంతి వల్ల కేవలం నీడను మాత్రమే చూడగలుగుతున్నాం. బ్లాక్ హోల్స్ కచ్చితంగా ఎలా ఏర్పడుతున్నాయని ఇప్పటి వరకూ నిర్దారణ కాలేదు. రెండు నక్షత్రాలు పక్కపక్కనే ఉండి ఒకదాని గ్రావిటీనుంచి మరొకటి తప్పించుకునేందుకు తిరుగుతూ ఈ గెలాక్సీల్లో ఓ అలజడిని అలలను సృష్టిస్తున్నాయా. అలా సృష్టించబడుతున్న అలలే స్పేస్ ఫ్యాబ్రిక్ లో కదలికలకు కారణమై... గ్రావిటీకి, స్పేస్ టైమ్ కు కారణమవుతున్నాయా. ప్రస్తుతానికి క్యూరియాసిటీ పెంచుతున్న సంక్లిష్టమైన ప్రశ్నలివి..ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రెండూ కలిసి లీసా అనే మిషన్ ను స్టార్ట్ చేశాయి. Laser Interferometer Space Antenna అంటారు దీన్ని. 2030 దీన్ని ప్రారంబించాలని చూస్తున్నాయి. బ్లాక్ హోల్స్ నుంచి వస్తున్న గ్రావిటేషనల్ వేవ్స్ ను డిటెక్ట్ చేయటమే దీని పని. పూర్తిస్థాయి బ్లాక్ హోల్స్ మిస్టరీని మరికొన్నేళ్లలో మన శాస్త్రవేత్తలు చేధించగలుగుతారా అనేది చూడాల్సిందే.