Russia Ukraine Crisis:


డ్రోన్‌లు కూల్చివేత 


ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ కుట్ర చేసిందని ఆరోపించింది. రెండు డ్రోన్‌లను పుతిన్ ఆఫీస్‌పైకి పంపిందని, వాటిని తమ సైనికులు పేల్చి వేశారని వెల్లడించింది. దీనికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ప్రకటించింది. దీన్ని ఓ ఉగ్రదాడిగానే భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. మాస్కోలో డ్రోన్‌లపై నిషేధం విధించింది. 


"ఉక్రెయిన్ పుతిన్ హత్యకు కుట్ర పన్నింది. రెండు డ్రోన్‌లు పుతిన్ ఆఫీస్‌పైకి వచ్చాయి. వాటిని గుర్తించి వెంటనే పేల్చి వేశాం. దీన్ని ఉగ్రదాడిగానే భావిస్తున్నాం. సరైన బదులు కచ్చితంగా ఇచ్చి తీరతాం. క్రెమ్లిన్‌ను టార్గెట్ చేస్తూ రెండు డ్రోన్‌లు దూసుకొచ్చాయి. వెంటనే పేల్చేశాం. ఈ ఘటనలో పుతిన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. క్రెమ్లిన్ బిల్డింగ్‌కి కూడా ఎలాంటి డ్యామేజ్ అవలేదు" 


- రష్యా




ఇప్పుడే కాదు. రష్యాలో పలు సార్లు ఇలాంటి డ్రోన్‌ దాడులు జరిగాయి. ప్రతిసారీ ఉక్రెయిన్‌పై వేలెత్తి చూపుతోంది రష్యా. అయితే..ఇప్పటి వరకూ ఉక్రెయిన్ మాత్రం ఆ దాడులు తామే చేసినట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సారి మాత్రం వెంటనే స్పందించింది. ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.