Serbia School Shooting:  



సెర్బియాలో ఘటన..


సెర్బియాలో ఓ టీనేజర్ జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది విద్యార్థులు కాగా..మరొకరు సెక్యూరిటీ గార్డ్‌. స్కూల్‌లో ఉన్నట్టుండి గన్‌తో కాల్పులు జరిపాడు 14 ఏళ్ల బాలుడు. తోటి విద్యార్థులపై గన్ గురి పెట్టి కాల్చేశాడు. ముందు ఓ టీచర్‌పై గన్ ఫైర్ చేసిన ఆ బాలుడు...ఆ తరవాత క్లాస్‌రూమ్‌లోని విద్యార్థులపై గురి పెట్టాడు. కొంత మంది విద్యార్థులు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కాల్పుల్లో ఓ టీచర్ తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉందని, ప్రాణాలతో పోరాడుతున్నారని వైద్యులు వెల్లడించారు. ఇప్పటి వరకూ 9 మంది చనిపోయారని...మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అక్కడి అధికారులు తెలిపారు. సెవెంత్ గ్రేడ్ చదువుతున్న విద్యార్థే ఈ కాల్పులు జరిపాడని, వెంటనే అతడిని అరెస్ట్ చేశారమని పోలీసులు స్పష్టం చేశారు. 


"ఓ సెక్యూరిటీ గార్డ్ టేబుల్ కింద పడిపోయాడు. మరి కొందరు అమ్మాయిల చొక్కాలు పూర్తిగా రక్తంతో తడిసిపోయాయి. ఆ కాల్పులు జరిపిన విద్యార్థి మంచి వాడేనని, చాలా సైలెంట్‌గా ఉండే వాడని విద్యార్థులు చెబుతున్నారు. ఈ మధ్య సెవెంత్ గ్రేడ్‌లో చేరాడు. ఉన్నట్టుండి ఇలా గన్‌ ఫైరింగ్ చేశాడు"


- ప్రత్యక్ష సాక్షి






ప్రస్తుతం ఆ స్కూల్‌ ఉన్న ప్రాంతమంతా పోలీసులతో నిండిపోయింది. బులెట్ ప్రూఫ్‌ జాకెట్‌లతో పెద్ద ఎత్తున అక్క మొహరించారు. 


"స్కూల్‌లో నుంచి విద్యార్థులు భయంతో పరుగులు పెడుతూ బయటకు వస్తుండడం నేను చూశాను. గట్టిగా అరుస్తూ బయటకు వచ్చారు. తల్లిదండ్రులు వెంటనే అక్కడికి వచ్చారు. భయంతో వణికిపోయారు. ఆ తరవాత మూడు సార్లు గన్ ఫైరింగ్ జరిగిన శబ్దాలు వినిపించాయి"


- ప్రత్యక్ష సాక్షి


అసలు ఎందుకు కాల్పులు జరిపాడు అన్నది విచారణ జరిపిన తరవాతే తెలియనుంది. ప్రస్తుతానికైతే కారణాలేమీ తేలలేదు. నిజానికి సెర్బియాలో ఫైరింగ్ ఘటనలు జరగడం చాలా అరుదు. ఇక్కడి చట్టాలు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. కానీ...కొన్ని ముఠాలు ఇలా అక్రమంగా తుపాకులు అమ్ముతున్నాయి. ఫలితంగా...క్రైమ్ రేట్ పెరుగుతోంది. 


టెక్సాస్‌లోనూ..


అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లో ఓ వ్యక్తి తుపాకీతో ఐదుగురిని కాల్చి చంపేశాడు. మృతుల్లో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు ఫ్రాన్సిస్కో ఒరోపెజా పై ఇప్పటికే మర్డర్ కేసులున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎప్పటి నుంచో పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. అయితే టెక్సాస్‌లోని క్లీవ్‌లాండ్‌లో ఓ ఇంట్లో దాక్కున్న నిందితుడు ఉన్నట్టుండి బయటకు వచ్చి గన్‌ ఫైరింగ్ మొదలు పెట్టాడు. పక్కింటి వాళ్లు ఈ ఫైరింగ్‌ సౌండ్ విని భయపడిపోయారు. వెంటనే బయటకు వచ్చి ఫైరింగ్ ఆపాలని చెప్పారు. ఇంట్లో చిన్నపాప నిద్రపోతోందని, భయపడుతోందని వార్నింగ్ ఇచ్చారు. కానీ....ఆ నిందితుడు అందుకు ఒప్పుకోలేదు. పైగా నా ఇంట్లోకి ఎందుకొచ్చావ్ అంటూ బెదిరించాడు. ఆ తరవాత ఉన్నట్టుండి వాళ్లపై కాల్పులు జరిపాడు.  AR-15 గన్‌తో ఫైరింగ్ మొదలు పెట్టాడు. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 8 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెప్పారు. "నా ఇష్టమొచ్చినట్టు చేసుకుంటా" అంటూ గన్‌ ఫైరింగ్ చేశాడు. కాల్పులు జరిపిన తరవాత పరారయ్యాడు. 


Also Read: Crocodiles: చేపల వేటకు వెళ్లి అదృశ్యం, చివరకు మొసలి కడుపులో ప్రత్యక్షం