మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. సెంట్రల్ మెక్సికోలోని మిచోవాకాన్ స్టేట్ పరిధిలో ఉన్న లాస్ టినాజస్ పట్టణంలో ఓ దుండగులు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 19 మంది మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
ఎలా జరిగింది?
లాస్ టినాజస్ పట్టణంలో కొంతమంది పార్టీ చేసుకున్నారు. అప్పుడు గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఘటనలో మరికొందరు గాయపడగా, వీరిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై స్థానిక మేయర్ ట్వీట్ చేశారు.
కాల్పుల వెనుక గల కారణాలు ఇంకా తెలియలేదు. మెక్సికోలో ఎక్కువ హింస జరిగే ప్రాంతాల్లో మిచోవాకాన్ ఒకటి. ఇక్కడ రెండు వర్గాలు నిత్యం కాల్పులు జరుపుకొంటూ ఉంటాయి. కాల్పుల్లో ప్రతి ఏటా వందల మంది మరణిస్తుంటారు.
డ్రగ్ ట్రాఫికింగ్ సహా పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రత్యర్ధి ముఠాల మధ్య తరచూ ఘర్షణలు తలెత్తుతుంటాయి. 2006లో కేంద్ర బలగాలతో ప్రభుత్వం యాంటీ డ్రగ్ ఆపరేషన్ చేపట్టినప్పటి నుంచి మెక్సికో డ్రగ్ సిండికేట్ మధ్య వార్ జరుగుతోంది. 2006 నుంచి ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో దాదాపు 3,40,000 మందికి పైగా మరణించారు.
ముఠాల వార్
మార్చి మొదటి వారంలో ఓ దుండగుడు ఇలానే కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో 17 మంది వరకు మరణించారు. ఇక్కడ ఇలా ముఠా తగాదాలు, కాల్పులు ప్రజలకు అలవాటైపోయాయి. పోలీసులు మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ ఇలా కాల్పులు జరిగిన ప్రతిసారి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Also Read: Tamil Nadu News : రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు, లెక్కపెట్టడానికే 10 గంటలు పట్టింది!
Also Read: West Bengal Assembly: బంగాల్ అసెంబ్లీలో దంగల్- చొక్కాలు చిరిగేలా ఎమ్మెల్యేల ఫైట్