ట్విట్టర్‌లో టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇటీవల ఆయనకు ట్విట్టర్ మీద కోపం వచ్చింది. మూడు రోజుల కిందట ఆయన 
యూజర్ల వాక్‌ స్వాతంత్ర్యం ట్విటర్‌ దెబ్బతీస్తోందని ఒక ట్విట్‌ చేశారు. ట్విటర్‌ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నదని మీరు భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై పోల్ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో 70 శాతం మంది అమలు చేయడం లేదని స్పందించారు. దీంతో కొంత ఫ్లాట్ ఫామ్ అవసరమా అని కూడా ప్రశ్నించారు. దీంతో సొంతంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ రూపొందించాలని ఆయన అనుకుంటున్నట్లుగాప ప్రచారం జరుగుతోంది. 


 





 ఓపెన్ సోర్స్ అల్గారిథమ్‌తో ఫ్రీ స్పీచ్‌కు టాప్ ప్రయారిటీ ఇచ్చేలా, విష ప్రచారానికి తావే లేని సోషల్ మీడియా  ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలనుకుంటున్నారా? అని ఓ ట్విట్టర్ యూజర్ ప్రశ్నించగా.. తాను ఈ విషయాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఎలన్ మస్క్ సమాధానం ఇచ్చారు. ప్రీ స్పీచ్‌ నేపథ్యంలో కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంను తెచ్చేందుకు ప్రణాళికలను రచిస్తోన్నట్లు వివరించారు. ఓ ట్విటర్‌లో ఒక నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చాడు ఎలన్‌ మస్క్‌. 



అయితే చాలా మంది యూజర్లు ఇప్పుడు ఆయనను కొత్త ఫ్లాట్ ఫామ్ తీసుకు రావడం కన్నా.. ట్విట్టర్‌ను కొనేయమని సలహాలిస్తున్నారు. ఈ సలహాలు ఆయనకు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 


 






ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్పేస్‌ టెక్నాలజీ, శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ఇలా ఎన్నో సేవలను ఎలన్‌ మస్క్‌ సంస్థలు అందిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం యాపిల్‌ స్మార్ట్‌ఫోన్లకు పోటీగా టెస్లా స్మార్ట్‌ఫోన్స్‌ను కూడా తెచ్చేందుకు మస్క్‌ సన్నాహాలు చేస్తోన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై మస్క్ కన్నేశారు.  మస్క్ కొత్త సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంను  నిర్మిస్తే..ఆయనకు ఉన్న క్రేజ్‌కు తగ్గట్లుగా యూజర్స్ వచ్చే అవకాశం ఉంది.