Intenational Flights Resume From India: అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసే వారికి శుభవార్త. దాదాపు రెండేళ్ల తరువాత రెగ్యూలర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్ల కిందట అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది కేంద్రం. ఆదివారం నుంచి రెగ్యూలర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సర్వీసులు ప్రారంభం అవుతాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.


నేటి నుంచి 40 దేశాల విమానాల సర్వీసులు.. 
మారిషస్, అమెరికా, మలేషియా, థాయ్‌లాండ్, టర్కీ, ఇరాక్ తో సహా మొత్తం 40 దేశాలకు చెందిన 1,783 విమాన సర్వీసులు ఈ ఏడాది సమ్మర్ ప్లాన్‌లో భాగంగా ప్రయాణికులకు సేవలు అందించేందుకు అనుమతి లభించింది. ఇండియా సలామ్ ఎయిర్, ఎయిర్ అరేబియా అబుదాబి, కంటాస్ అండ్ అమెరికన్ ఎయిర్ లైన్ వంటి కొత్త ఎయిర్ లైన్స్ సైతం భారత్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మార్చి 2020లో కేంద్ర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిషేధించింది.


నెంబర్ వన్‌గా ఇండిగో సర్వీసులు..
దాదాపు రెండేళ్ల తరువాత ఇంటర్నేషనల్ సర్వీసులు పునరుద్ధరిస్తున్న కారణంగా వారానికి 3,249 వరకు విమానాలు భారత్‌కు నడిపేందుకు విదేశీ ఎయిర్ లైన్స్ సిద్ధంగా ఉన్నాయి. భారత్‌కు చెందిన ఆరు ఎయిల్ లైన్స్ సైతం విదేశాలకు తమ సేవల్ని తిరిగి ప్రారంభించాయి. కరోనా సంక్షోభంతో ఆగిపోయిన విమాన సేవలు అంతర్జాతీయంగా భారత్ నుంచి నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది డీజీసీఐ. ఇండిగో విమానం వారానికి 505 మేర సర్వీసులలో తొలి స్థానంలో ఉండగా.. ఎయిరిండియా 362 సర్వీసులు, ఏఐ ఎక్స్‌ప్రెస్ 340 సర్వీసులు, ఎమిరెట్స్ 170 విమాన సర్వీసులను విదేశాలకు నడపనుంది. మే 1 నుంచి ఇండిగో ఇస్తాంబుల్‌కు సర్వీసులు మొదలుపెట్టనుంది. కరోనా వ్యాప్తి చేసిందని భావిస్తున్న చైనా దేశానికి మాత్రం భారత్ విమాన సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


విదేశాల నుంచి ఎమిరెట్స్ టాప్..
విదేశాల నుంచి భారత్‌కు అత్యధికంగా వారానికి 170 సర్వీసులను ఎమిరెట్స్ నడుపుతోంది. ఆ తరువాత ఎయిర్ అరేబియా 140 వరకు ఇంటర్నేషనల్ సర్వీసులు అందిస్తోంది. అమెరికాకు చెందిన ఎయిర్ లైన్స్ యునైటెడ్ ఎయిర్ లైన్స్ 28, అమెరికన్ ఎయిర్ లైన్స్ వారానికి 7 సర్వీసులు నడుపుతోంది.
Also Read: Viral Video : మన భోజనం తిన్న ధాయ్ వాసి ! ఆ వ్యక్తి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే...


Also Read: Ukraine War Loss : రష్యా యుద్ధోన్మాదానికి శిధిలంగా మారిన ఉక్రెయిన్ ! ఇవిగో జలదరించే.. కదిలించే దృశ్యాలు