ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి నెల రోజులు దాటిపోయింది.  బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. విధ్వంసం జరుగుతూనే ఉంది.  ఎప్పటికి ముగస్తుందో తెలియదు కానీ.., యుద్ధ విధ్వంస దృశ్యాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఈ నష్టం పూడ్చుకోవడం ఉక్రెయిన్‌కు అంత తేలిక కాదు. ఉక్రెయిన్‌లోని మరియాపోల్ నగరం పూర్తి స్థాయిలో ధ్వంసం అయింది. పై నుంచి చూస్తే శిథలాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఆ నగర మేయర్‌ను కూడా కిడ్నాప్ చేసిన రష్యా సైనికులు తర్వాత వదిలి పెట్టారు. 






కీవ్ అంటే అందమైన నగరం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాలిపోయినకార్లు.. కూలిపోయినభవనాలే కనిపిస్తున్నాయి.


 






అనేక మంది కళాకారులు... తమ ప్రాతానికి జరిగిన నష్టాన్ని ప్రపంచానికి తెలిపేందుకు భిన్నమైన మార్గాల్ని ఎంచుకుంటున్నారు., రష్యా యుద్ధోన్మాద సాక్ష్యాలుగా పేర్కొంటూ... ధ్వంసమైన ఆస్తుల ముందు పాటలు పాడుతున్నారు. 





కొంత మంది కళాకారులు యుద్ధంలో పని చేస్తూనే దేశం కోసం భిన్నమైన మార్గాల్లో తమ ధైర్యాన్ని వెల్లడిస్తున్నారు. 29వ తేదీన రాజధాని కీవ్‌లో భారీ కాన్సర్ట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 





నాటో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగకపోయినప్పటికీ ఈ యుద్ధంలో  ఉక్రెయిన్ గెలుస్తుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.