Meta employee earning 3 crore fired for using meal credits to buy household items : సోషల్ మీడియాలో రారాజుగా వెలుగొందుతున్న మెటా కంపెనీ తమ ఉద్యోగుల్ని ఎలా వదిలించుకుందామా అని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే కొన్ని వేల మందికి లే ఆఫ్ ప్రకటించింది. ఇప్పుడు చిన్న చిన్న తప్పులు ఉన్నవారిని ఇంటికి పంపుతోంది. తాజాగా ఓ నలభై మందిని ఇలా ఉద్యోగాల నుంచి తీసేసింది. ఎందుకు అంటే.. వారికి ఇచ్చిన పుడ్ కూపన్లను ఫుడ్ కొనుగోలు కోసం కాకుండా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారట. వాటి విలువ ఇరవై డాలర్లు. అందుకే ఉద్యోగం నుంచి తీసేశారు.  


మెటా కంపెనీ తమ ఆఫీసుల్లోపని చేసే వారికి ఫుడ్ కూపన్లు ఇస్తుంది. షిప్టుల్ని బట్టి ఈ కూపన్లకు వాల్యూ ఉంటుంది. ఉదయం పూట అయితే ఇరవై డాలర్లు, లంచ్, డిన్నర్ కోసం అయితే పాతిక డాలర్లు చొప్పున కూపన్లు ఇస్తుంది. వాటిని ఆఫీసులో వర్క్ చేసే టప్పుడు ఉబెర్ ఈట్స్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుని తినవచ్చు. అంటే ఆఫీసులో పని చేసేటప్పుడు మాత్రమే ఉద్యోగులకు ఫ్రీమీల్స్ సౌకర్యాల్లో భాగంగా వాటిని కల్పించారు. అయితే కొంత మంది ఉద్యోగులు వాటితో తమ ఇంట్లోకి కావాల్సిన ఉప్పులు, పప్పులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై విచారణ జరిపి దాదాపు నలభై మందిని ఉద్యోగాల నుంచి మెటా యాజమాన్యం తొలగించింది. ఆ తొలగింపునకు వారు చెప్పిన కారణం కూడా.. ఫుడ్ కూపన్లను దుర్వినియోగం చేయడమే. 


జాన్సన్‌ బేబీ పౌడర్‌ వాసన పీల్చినా క్యాన్సర్‌!? - తస్మాత్‌ జాగ్రత్త!


ఉద్యోగం కోల్పోయిన వారి జీతాలు మన రూపాయల్లో ఏడాదికి మూడు కోట్ల వరకూ ఉంటుంది. వారిలో కొంత మంది సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. తాము ఆఫీసులో  తినాల్సిన అవసరం లేనప్పుడు ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీలు ఉన్నప్పుడు.. ఇతర సందర్భాల్లో పుడ్ కూపన్లను వినియోగించుకోలేకపోతే వృధా  పోవడం ఎందుకని  ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న వస్తువుల్నికొనుగోలు చేసుకున్నామని అంత మాత్రానికే ఉద్యోగం నుంచి తీసేస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


బాంబులు పేల్చేందుకు కిమ్‌కు కూడా ఉబలాటమే - దక్షిణ కొరియాను రెచ్చగొట్టే పనులు షురూ !


ఈ విషయంలో మెటా కంపెనీ వర్గాలు బహిరంగ ప్రకటన చేయకపోయినప్పటికీ ఉద్యోగులకు అంతర్గత సందేశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫుడ్ కూపన్ల దుర్వినియోగం చాలా కాలంగా చేస్తున్నందునే  వారిని ఉద్యోగం నుంచి తీసేశామని తెలిపింది. కొంత మంది ఆఫీసులో వినియోగించకోవాల్సిన పుడ్ కూపన్లను ఇంట్లో ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నారని  వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. బహుశా.. తాము అందర్నీ దృష్టిలో పెట్టుకున్నామని వారి వంతు వచ్చినప్పుడు ఆ కారణం చూపి తీసేస్తామని బెదిరించినట్లయింది. మెటాలో ఉద్యోగం  అంటే ఆహా అనుకునే పరిస్థితి నుంచి.. పాపం అనుకునే పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.