Japanese Wolf Suit:
తోడేలు సూట్..
ఒక్కొక్కరికీ ఒక్కో కల. కొంత మంది మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని. మరి కొందరు పెద్ద ఇల్లు కట్టుకోవాలని. ఇంకొందరు రిచ్‌గా బతకాలని. కానీ కొంత మంది కలలు మాత్రం చాలా వింతగా ఉంటాయి. జపాన్‌లోని ఓ వ్యక్తికి "తోడేలుగా మారిపోవడం" ఇష్టం అట. చిన్నప్పటి నుంచి ఈ కల నెరవేర్చుకునేందుకు బోలెడంత డబ్బు సంపాదించి పెట్టుకున్నాడు. ఇందుకోసం రూ.20 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు అచ్చం తోడేలుగానే మారిపోయాడు. ఇంజనీర్ అయిన టొరు ఉయెడా (Toru Ueda) తోడేలు కాస్ట్యూమ్ కోసం గతేడాది ఆర్డర్ పెట్టాడు. అది చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకున్నాడు. అందుకే చాలా ప్రయత్నాలు చేసి కాస్త కాస్ట్ ఎక్కువైనా సరే...మంచి కాస్ట్యూమ్ కావాలని ట్రై చేసి చివరకు అది సంపాదించాడు. అది వచ్చీ రాగానే డ్రెసప్ అయ్యి ఫొటోలు తీయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి తెగ వైరల్ అయిపోయాయి. ఫిల్మ్, టీవీ ఇండస్ట్రీస్‌కి కాస్ట్యూమ్‌లు డిజైన్ చేసే Zeppet Workshop ఈ సూట్‌ని డిజైన్ చేసింది. ఈ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు 7 వారాల పాటు కష్టపడి ఈ సూట్ తయారు చేశారు. ఇంత ఖర్చు పెట్టి మరీ ఆర్డర్ చేసినప్పుడు ఆ మాత్రం పర్‌ఫెక్షన్ ఉండాలి కదా అని చెప్పారు ఆ ఎంప్లాయిస్. అయితే...ఆ సూట్‌ని కాసేపు వేసుకుని ఫొటోలు దిగిన తరవాత ఆ మురిపెం తీరిపోయిందని పక్కన పెట్టేశాడు టొరు ఉయెడా. ఫ్యాన్సీ డ్రెస్ పార్టీలకు ఈ సూట్ వేసుకుని వెళ్లనని తేల్చి చెబుతున్నాడు. ఈ సూట్ వేసుకుని నడవడం చాలా ఇబ్బందికరంగా ఉందని అంటున్నాడు 32 ఏళ్ల టొరు ఉయెడా. "ఈ సూట్ వేసుకున్నప్పుడు నేను మనిషిని అన్న సంగతే మర్చిపోతున్నాను. అంత బాగుంది" అని ఎగ్జైట్ అవుతున్నాడు.
"ఈ సూట్ వేసుకున్నప్పుడు నా చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతున్నాను. నేను మనిషినన్న సంగతీ పక్కన పెట్టి ఆ క్షణాల్ని ఆస్వాదిస్తున్నాను. పని ఒత్తిడి నుంచి సులువుగా బయట పడుతున్నాను. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ నాకు నేనే నచ్చుతున్నాను. నిజంగా తోడేలులాగే ఉన్నాను"
- టొరు ఉయెడా, జపాన్
డాగ్ సూట్ కూడా..
జెప్పెట్ కంపెనీ ఉద్యోగులతో మీటింగ్ అయిన ప్రతిసారీ..."నాకు కంఫర్ట్‌గా, పర్‌ఫెక్ట్‌గా ఉండే సూట్ కావాలి" అని చెప్పాడట టొరు ఉయెడా. వీలైనంతం అందంగా డిజైన్ చేయాలని చెప్పాడు. ఇదే కంపెనీ అంతకు ముందు ఓ వ్యక్తికి డాగ్ సూట్ తయారు చేసింది. ఆ వ్యక్తి వివరాలు ఇప్పటికీ గోప్యంగానే ఉన్నప్పటికీ ఆ వార్త కూడా వైరల్ అయింది. ఇటీవలే డాగ్ సూట్ వేసుకున్న వ్యక్తి రోడ్డుపైన నడిచాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ సూట్ కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశాడు టోకో.
Also Read: Foxcon Plant: తమిళనాడు ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్ భారీ డీల్, రాష్ట్రంలో మరో ప్లాంట్