నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగించిన తర్వాత మన స్పేస్ సైన్స్ లో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రత్యేకించి ఇప్పటివరకూ ఓ నిర్దిష్టమైన అభిప్రాయాలుగా ఉన్నవన్నీ కూడా మార్చుకోవాల్సి వస్తోంది. రీసెంట్ గా నాసా జేమ్స్ వెబ్ తీసిన ఫోటోల్లో నెప్ట్యూన్ అసలు రంగు బయటపడింది. ఫన్నీగా అన్నాను కానీ లాస్ట్ 30 ఏళ్లలో ఎప్పుడూ నెప్ట్యూన్ ని చూపించని విధంగా నాసా జేమ్స్ వెబ్ ఫోటోలు తీసింది. సూర్యుడికి చాలా దూరంగా ఉండే గ్రహం కావటంతో ఓ పెద్ద మంచుకొండ లాంటి ఈ గ్రహానికి ఏదో శనిగ్రహంలాగా రింగులుండటం లేటెస్ట్ రివిలేషన్ అని చెప్పుకోవాలి. దానికి తోడు కలర్ కూడా ఇప్పటివరకూ నెప్ట్యూన్ బ్లూ కలర్ లో ఉంటుంది అనే అభిప్రాయం కొంత మేర కరెక్ట్ కాదని నాసా జేమ్స్ వెబ్ తేల్చింది.


అప్పట్లో వోయేజర్ :
మనకు చివరిసారిగా అంటే 1989 లో వోయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లోకి వెళ్లే ముందు  నెప్ట్యూన్ ను చాలా దగ్గర నుంచి క్లిచిక్ అని ఫోటోలు తీసి పంపించింది.  అప్పుడు కూడా కొన్ని బ్రైట్, నారో రింగ్స్ కనిపించాయి ఇప్పుడు జేమ్స్ వెబ్ తీసిన ఫోటోల్లో మాత్రం ఈ రింగులు చాలా క్లియర్ గా కనిపించి అసలు శని గ్రహమా, నెప్ట్యూనా ఇది అని సందేహం కలిగేంత స్థాయిలో వలయాలు ఉన్నాయిప్పుడు.


నెప్ట్యూన్ కి రింగులున్నాయి:
వాస్తవానికి ఈ రింగులు ఏంటంటే దుమ్ము ధూళితో ఏర్పడిన వలయాలు అన్నమాట. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇన్ ఫ్రారెడ్ లైట్ తో చూస్తుంది కనుక అవి ఇంకా క్లియర్ గా కనిపించాయి ఇప్పుడు. 1846లో నెప్ట్యూన్ ని కనుగొన్నప్పటి నుంచి దానిపై అంతరిక్ష పరిశోధకులు ఓ కన్నేసి ఉంచారు. సూర్యుడి కి భూమి కి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే...సూర్యుడికి నెప్ట్యూన్ కి ఉన్న దూరం 30 రెట్లు ఎక్కువ. అంటే అర్థం చేసుకోండి ఎంత దూరంలో ఉందో సూర్యకుటుంబంలో ఈ గ్రహం. సో సూర్యుడి వల్ల ఏర్పడే మిట్టమధ్యాహ్నం కూడా నెప్ట్యూన్ పైన ఏదో మసక చీకటిలా ఉంటుంది.


నీలి రంగుకు కారణమిదే :
నెప్ట్యూన్ ని ఐస్ జెయింట్ అని ఎందుకు అంటారంటే దాని ఇంటీరియర్ మేకప్ అలా ఉంటుంది. బృహస్పతి, శని గ్రహాలతో పోలిస్తే నెప్యూన్ మీద చాలా రిచ్ ఎలిమెంట్స్, హైడ్రోజన్, హీలియం ఉన్నాయని పరిశోధకులు గతంలో తేల్చారు. ఫలితంగా నెప్ట్యూన్ నీలిరంగులో కనిపిస్తున్నట్లు భావించారు. హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటోల్లో నెప్ట్యూన్ బ్లూ కలర్ లోనే ఉన్నట్లు కనిపించింది. మీథేన్ గ్యాస్ రూపంలో నెప్ట్యూన్ ను ఆవిరించి ఉండటం కూడా ఈ నీలిరంగుకు ఓ కారణం.


రింగులు ఎందుకున్నాయంటే :
కానీ జేమ్స్ వెబ్ నియర్ ఇన్ ఫ్రా రెడ్ కెమెరా తీసిన ఇమేజ్ లు మరింత స్పష్టంగా నెప్ట్యూన్ ను మన ముందర పెట్టాయి. ఈ ఫోటోల ఆధారంగా నెప్ట్యూన్ మరీ అంత బ్లూ కలర్ లో ఉండదని తెలుస్తోంది. వాస్తవానికి మీథేన్ గ్యాస్ ఇన్ ఫ్రా రెడ్ లైట్ ను అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా డార్క్ గానే కనిపించింది అనుకోవాలి. నెప్ట్యూన్ ఉపరితలంలో ఉన్న  మీథేన్ క్లౌడ్స్ సూర్యుడి నుంచి వస్తున్న కాంతిని నెప్ట్యూన్ మీద పడనీయకుండానే రిఫ్లెక్ట్ అయిపోయేలా చేస్తున్నాయి. అంతే కాదు ఇప్పుడు కనిపిస్తున్న ఈ రింగుల కారణం కారణంగా అర్థమవుతున్నది ఏంటంటే...నెప్ట్యూన్ పై ఏర్పడుతున్న తుపాన్లు, భయంకరమైన గాలులకు ప్రతీక అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


నక్షత్రం కాదు చందమామే :
ఇప్పటి వరకూ నెప్ట్యూన్ కి 14 చందమామలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ 14లో ఏడు చందమామలు నాసా జేమ్స్ వెబ్ తీసిన ఫోటోల్లో కనిపించాయి. అంతే కాదు ఓ పెద్ద నక్షత్రం నెప్ట్యూన్ పక్కన బాగా మెరుస్తున్నట్లు కనిపించింది. వాస్తవానికి అది నక్షత్రం కాదు ట్రైటాన్ అనే నెప్య్టూన్ చందమామ. ట్రైటాన్ పై నైట్రోజన్ మొత్తం గడ్డకట్టుకుని పోయింది. సో సూర్యుడి నుంచి వస్తున్న కాంతిలో 70 శాతం వెనక్కి తన్నేస్తోంది అది. అందుకే ఈ స్థాయిలో ఏదో నక్షత్రంలా ధగ ధగ మెరిసిపోతూ ఉంది. ట్రైటాన్ స్పెషాలిటీ అన్నీ ఓ డైరెక్షన్ లో నెప్ట్యూన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి...ఈ ట్రైటాన్ మాత్రం అపోజిట్ లో తిరుగుతోంది. సో ఇదన్న మాట. నాసా జేమ్స్ వెబ్ తీసిన రీసెంట్ ఫోటోల్లో బయటపడిన నెప్ట్యూన్ రంగు.