Israel Gaza War:


బైడెన్‌కి హెచ్చరికలు..


Gaza News: ఇజ్రాయేల్‌, హమాస్‌ యుద్ధం (Israel Hamas War) విషయంలో ఇజ్రాయేల్‌కి భారీ మద్దతునిస్తోంది అమెరికా. ఈ విషయంలో అరబ్ దేశాల్లోని అమెరికా దౌత్యవేత్తలు (US Diplomats) తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయేల్‌కి మద్దతునివ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతే కాదు. అమెరికా ప్రభుత్వాన్ని వాళ్లు హెచ్చరించారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ సపోర్ట్ కారణంగా అరబ్ దేశాల్లోని ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్లమవుతామని వార్నింగ్ ఇచ్చారని CNN తెలిపింది. ఒమన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలోని దౌత్యవేత్తలూ ఇదే హెచ్చరికలు చేశారు. ఇది కూడా యుద్ధ నేరం కిందకే వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఇలా మద్దతునిచ్చి గౌరవం పోగొట్టుకుంటున్నామని మండి పడుతున్నారు. ఇదే విషయాన్ని అమెరికాకి టెలిగ్రామ్ చేసినట్టు తెలుస్తోంది. టెక్నికల్‌గా దీన్నే diplomatic cable అని పిలుస్తారు. వైట్‌హౌజ్‌కి చెందిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు CIA,FBIకి ఈ టెలిగ్రామ్ పంపారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని అమెరికన్ ఎంబసీ నుంచి కూడా ఇదే విధంగా హెచ్చరికలు వచ్చాయి. అధ్యక్షుడు బైడెన్ కారణంగానే ఇదంతా జరుగుతోందని మండిపడ్డారు. అంతే కాదు. గత అధ్యక్షుల కన్నా బైడెన్ మరీ క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు దౌత్యవేత్తలు. ఇజ్రాయేల్‌కి మున్ముందు కూడా పూర్తి మద్దతు ఉంటుందని ఇటీవలే బైడెన్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో అమెరికన్ దౌత్యవేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేయడం సంచలనంగా మారింది. 


యుద్ధంపై బైడెన్ ఏమన్నారంటే..? 


ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంపై (Israel Hamas War) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాజాని ఆక్రమించుకోవడం ఇజ్రాయేల్‌కి అంత మంచిది కాదని స్పష్టం చేశారు. ఇజ్రాయేల్‌ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన తరవాత బైడెన్ ఈ కామెంట్స్ చేశారు. హమాస్‌తో యుద్ధం ముగిసిన తరవాత పాలస్తీనా భద్రత బాధ్యత తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడి అభిప్రాయాన్ని ఆ దేశ National Security Council ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. 


"ఇజ్రాయేల్ సైన్యం గాజాని తిరిగి ఆక్రమించుకోవడం సరికాదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇలా చేయడం వల్ల ఇజ్రాయేల్‌కి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని, ఇజ్రాయేల్ పౌరులకూ ఇది మంచిది కాదని వెల్లడించారు. సెక్రటరీ బ్లింకెన్‌ కూడా ఈ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్ పూర్తైన తరవాత గాజా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోడానికే కష్టంగా ఉంది. అక్కడి పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంటుందో? ఏదేమైనా అక్టోబర్ 7 ముందు నాటి పరిస్థితులైతే పాలస్తీనాలో ఉండకపోవచ్చు


- జాన్ కిర్బీ, అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి


 Also Read: భారత్‌పై విషం చిమ్మిన లష్కరే తోయిబా మాజీ కమాండర్ పాక్‌లో హతం, కాల్చి చంపిన దుండగులు