Akram Khan Shot Dead: 


అక్రమ్ ఖాన్ హతం..


LeT Former Commander Akram Khan: లష్కరే తోయిబా మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ (Lashkar-e-Taiba) పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. అక్రమ్ ఖాన్ (Akram Khan Shot Dead) అలియాస్ అక్రమ్ గాజీ ఖైబర్‌ ఫంక్తువా ప్రావిన్స్‌లో బజౌర్‌లో ఉంటున్నాడు. అక్కడే దారుణ హత్యకు గురయ్యాడు. 2018-20 వరకూ అక్రమ్ ఖాన్‌ లష్కరే తోయిబా రిక్రూట్‌మెంట్‌ని లీడ్‌ చేశాడు. పాకిస్థాన్‌లో భారత్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. విద్వేషపూరిత ప్రసంగాలు చేసి యువతను రెచ్చగొట్టేవాడు. లష్కరే తోయిబాలో అత్యంక కీలకమైన వ్యక్తుల్లో ఒకడిగా ఉన్నాడు. చాలా రోజుల పాటు ఆ గ్రూప్‌లో యాక్టివ్‌గా పని చేసిన అక్రమ్ ఖాన్...దాడులను ముందుండి నడిపాడు. యువకులను గుర్తించి వాళ్లని రెచ్చగొట్టి తమ సంస్థలో చేర్చుకునేలా ప్రోత్సహించాడు. అక్రమ్ కారణంగానే చాలా మంది లష్కరే తోయిబావైపు మళ్లారు. పఠాన్‌కోట్ దాడుల్లో కీలక పాత్ర పోషించిన షాహిద్ లతీఫ్ (Shahid Latif) ఈ ఏడాది అక్టోబర్‌లో ఇదే విధంగా హత్యకు గురయ్యాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ లిస్ట్‌లో ఉన్నాడు లతీఫ్. 2016లో Pathankot Air Force స్టేషన్‌పై దాడులు చేశాడు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఏడుగురు సైనికులు వీరమరణం పొందారు.


అడవిలో నక్కి, చీకట్లో సైనిక దుస్తుల్లో వచ్చిన నలుగురు ముష్కరులు వైమానిక స్థావరంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. భారత భద్రతా సిబ్బంది వారిని ఎదుర్కొన్నారు. ఎదురు కాల్పులు మొదలుపెట్టారు. ఐదు గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన   ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌ఎస్‌జీ, స్వాట్ బృందాలు సమన్వయంతో వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. ముష్కరులను మట్టుబెట్టేందుకు  ఐదు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల వద్ద పెద్దఎత్తున ఆర్‌డీఎక్స్, గ్రెనేడ్ లాంచర్ మిషన్, 52 ఎంఎం మోర్టార్లు, ఏకే 47 తుపాకులు, జీపీఎస్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు దేశంలోని వైమానిక స్థావరంపై దాడికి పాల్పడడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో షాహిద్ లతీఫ్ ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా గుర్తించింది. అంతకు ముందు సెప్టెంబర్‌లో ఇదే లష్కరే తోయిబాకి చెందిన కమాండర్‌ని కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. 


Also Read: డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ఆ కీలక బిల్లులపై కేంద్రం ఫోకస్!