Israel Gaza Attack:



గాజా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు..


గాజా సరిహద్దు (Gaza Strip) వద్ద హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయేల్ సైన్యం దాడులు (Israel Hamas Attack) కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంపై పట్టు సాధించామని ఇప్పటికే ఇజ్రాయేల్ ప్రకటించింది. ఆరో రోజూ దాడులు తీవ్రంగానే జరుగుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులు గాజాలో దాదాపు 150 పౌరులని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను విడిచిపెట్టేంత వరకూ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయేల్ సైన్యం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మరో ప్రకటన కూడా చేసింది. నార్త్‌ గాజాలోని ప్రజలకు కీలక సూచనలు చేసింది. నార్త్ గాజాలోని 10 లక్షల మంది పౌరులు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పింది. 24 గంటల్లోగా అంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గాజా మొత్తం జనాభాలో సగం ఈ నార్త్ గాజాలోనే ఉంటున్నారు. ఈ ప్రకటన ఇప్పటికే వివాదాస్పదమైంది. ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలంటే వాళ్లు ఎక్కడికి పోతారని ప్రశ్నిస్తున్నాయి మానవ హక్కుల సంఘం. ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రంగానే స్పందించింది. ఈ ఆదేశాలు పాటించడం అసాధ్యం అని తేల్చి చెప్పింది. తీవ్ర పరిణామాలను తప్పించాలంటే ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేసింది. అటు ఇజ్రాయేల్ మాత్రం తన వాదన వినిపిస్తోంది. గాజా సరిహద్దు వద్ద హమాస్ ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన చిన్నారుల గ్రాఫిక్ ఫొటోలను అమెరికాకి పంపింది. పరిస్థితులు ఇలా ఉన్నాయని వివరించింది. మరి కొందరి ప్రాణాలు పోవద్దు అంటే వెంటనే అక్కడి నుంచి పౌరులంతా వెళ్లిపోవాలని అంటోంది ఇజ్రాయేల్ మిలిటరీ. ప్రధాని నెతన్యాహు కూడా హమాస్‌పై చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎలాగైనా అందరినీ మట్టుబెట్టాలని ఆర్మీకి ఆర్డర్ వేశారు. 






అప్‌డేట్స్ ఇవీ..


గాజాలో ఇజ్రాయేల్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ల కారణంగా శరణార్థుల క్యాంప్‌లూ ధ్వంసమయ్యాయి. చాలా మంది నిరాశ్రయులయ్యారు. 1300 మంది ఇజ్రాయేల్ పౌరులను చంపినందుకు ప్రతీకారంగా గాజాపై రాకెట్‌ దాడులు చేసింది ఇజ్రాయేల్. ఈ దాడుల్లో 1500 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయేల్‌ ఈ దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే ఇరాన్‌ హెచ్చరించింది. 30 సెకన్లకోసారి కాల్పులు జరుపుతోంది ఇజ్రాయేల్. ఇప్పటి వరకూ 4 వేల టన్నుల పేలుడు పదార్థాలతో విరుచుకుపడింది. లక్షలాది మంది రిజర్వ్‌ బలగాలను మొహరించింది. వేలాది మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అంతర్జాతీయ సంస్థలన్నీ ఈ ఉద్రిక్తతల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతానికి అమెరికా ఇజ్రాయేల్‌కి ఆయుధ సహకారం అందిస్తోంది. అమెరికా బలగాలు మాత్రం ఇజ్రాయేల్‌కి ఎలాంటి సహకారం అందించలేదు. రెండు దేశాల మధ్య యుద్ధం ఇతర దేశాలకు విస్తరిస్తోంది. లెబనాన్‌, సిరియాల నుంచీ ఇజ్రాయెల్‌ వైపు రాకెట్లు దూసుకువచ్చాయి. పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌పై గాజాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు, ఊహించని దాడి ఎదురైంది.  లెబనాన్‌, సిరియాల వైపు నుంచి దాడులు జరిగాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్‌ దళాలు, ఈ దాడులకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. 


Also Read: Israel-Hamas War: మొత్తం భూగ్రహమే మా చట్ట పరిధిలోకి వస్తుంది: హమాస్‌ కమాండర్‌ హెచ్చరిక