Israel Gaza War:



ఇజ్రాయేల్ మిలిటరీ వీడియో..
 
Gaza News: ఇజ్రాయేల్ మిలిటరీ (Israel Military) విడుదల చేసిన ఓ వీడియో సంచలనమవుతోంది. గాజాలోని Al Shifa హాస్పిటల్‌లో ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను పోస్ట్ చేసింది. అందులో హమాస్‌ చేతుల్లో బందీలైన ఇజ్రాయేల్ పౌరులు ఉన్నారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్‌ ఇజ్రాయేల్‌పై దాడులు చేసింది. ఆ సమయంలోనే ఇజ్రాయేల్ పౌరుల్ని (Israel Hostages Video) అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి వాళ్ల చేతుల్లోనే బందీలుగా ఉన్నారు చాలా మంది. ఎదురుదాడులు చేస్తూ వాళ్లను విడిపించుకుంటోంది ఇజ్రాయేల్ సైన్యం. తాము హాస్పిటల్‌పై ఎందుకు దాడులు చేస్తున్నామో క్లారిటీ ఇచ్చేందుకు ఇలా వీడియో విడుదల చేసింది ఇజ్రాయేల్ మిలిటరీ. అందులో నలుగురు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ పౌరుల్ని లాక్కుని లోపలకు తీసుకెళ్తున్నారు. "హమాస్ ఉగ్రవాదులు బందీలను ఎలా లోపలికి లాక్కెళ్తున్నాయో చూడండి. హాస్పిటల్‌లోకి తీసుకెళ్తున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి" అని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. నేపాల్, థాయ్‌లాండ్‌కి చెందిన పౌరుల్ని కిడ్నాప్ చేసినట్టు వెల్లడించింది. ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియడం లేదని తెలిపింది. అయితే...అక్టోబర్ 7 నాటి విజువల్స్‌ అని స్పష్టం చేసింది. ఆ రోజు చేసిన దాడుల్లో 1,200 మంది ఇజ్రాయేల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు బదులు తీర్చుకుంటోంది ఇజ్రాయేల్ మిలిటరీ. 240 మంది పౌరులను కిడ్నాప్ చేసింది హమాస్. అల్ షిఫా హాస్పిటల్‌లో (Al Shifa Hospital) చాలా మంది బందీలను దాచిపెట్టి..అక్కడి నుంచే దాడులు చేసినట్టు మొదటి నుంచి ఆరోపిస్తోంది ఇజ్రాయేల్. ఇప్పుడీ వీడియోని విడుదల చేసింది. పాలస్తీనా ప్రకటన ప్రకారం...ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ 13 వేల మంది పౌరులు చనిపోయారు.