Sam Altman Fired:
ఆసక్తికర ట్వీట్ చేసిన ఆల్ట్‌మన్..
OpenAI సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌ని (Sam Altman Sacked) తొలగిస్తూ కంపెనీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా డిబేట్ జరుగుతోంది. "నమ్మకం లేదు" అని చాలా సింపుల్‌గా రీజన్ చెప్పి ఆయనను తొలగించారు. ఆయన స్థానంలో మీరా మురతి (Mira Murati)ని నియమించారు. అసలు చాట్‌జీపీటీని ప్రపంచానికి పరిచయం చేసి అంత పాపులర్ చేసిందే ఆల్ట్‌మన్. అలాంటి వ్యక్తిని జస్ట్ గూగుల్ మీట్‌లో మాట్లాడుతుండగానే తొలగిస్తున్నట్టు ప్రకటించారు బోర్డు సభ్యులు. ఇప్పటి వరకూ ఈ నిర్ణయంపై స్పందించని ఆల్ట్‌మన్ ఉన్నట్టుండి ఆసక్తికర ట్వీట్ చేశాడు. OpenAI టీమ్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ అని పోస్ట్ పెట్టాడు. కంపెనీ నిర్ణయాన్ని ఖండిస్తూ పోస్ట్ పెడతాడనుకుంటే...ఇలా చాలా పాజిటివ్‌గా స్పందించడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు మనసు మార్చుకుని ఆయనని మళ్లీ CEO పదవి చేపట్టాలని ఆహ్వానించిందా..? అన్న వాదనా వినిపిస్తోంది. ఆయన ట్వీట్ కూడా అలానే ఉంది. ఈ ట్వీట్‌కి చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఆల్ట్‌మన్ ఈజ్ బ్యాక్ అంటూ కొందరు డైరెక్ట్‌గానే చెబుతున్నారు. ఇంకొందరు "హింట్ ఇస్తున్నారా" అని ప్రశ్నించారు. అయితే..ఆల్ట్‌మన్‌ని తొలగించడంపై కో ఫౌండర్ గ్రెగ్ బ్రాక్‌మన్ (Greg Brockman) స్పందించలేదు. కానీ సామ్ ఆల్ట్‌మన్ చేసిన ట్వీట్‌కి లైక్ కొట్టారు. అంటే...మళ్లీ వీళ్లిద్దరూ కలిసి చాట్‌జీపీటీని ముందుకి నడిపించనున్నారన్న హింట్ ఇచ్చారు. ఆల్ట్‌మన్‌ని తొలగించిన వెంటనే బ్రాక్‌మన్ రిజైన్ చేశారు. మరి కొందరు కీలక వ్యక్తులూ రాజీనామా చేసే అవకాశముందన్న ఊహాగానాలు వినిపించాయి.
సత్యనాదెళ్ల అసహనం..
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) OpenAI కంపెనీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. సామ్ ఆల్ట్‌మన్‌ని తొలగించిన తరవాత ఆయనకు మద్దతుగా నిలిచారు నాదెళ్ల. బోర్డ్ ఆయనను తొలగించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదే సమయంలో మధ్యంతర CEO మీరా మురతికి మద్దతునిస్తానని వెల్లడించారు. 2019 నుంచి OpenAI CEOగా కొనసాగుతూ వస్తున్నారు ఆల్ట్‌మన్.
ఐడియాలజీ విషయంలో బోర్డు సభ్యులకు ఆల్ట్‌మన్‌కి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. అయితే...కచ్చితంగా ఇది కారణమని మాత్రం సరిగ్గా చెప్పడం లేదు కంపెనీ. సేఫ్టీ, ప్రాఫిట్ - ఈ రెండు విషయాల్లోనే ఏకాభిప్రాయం కుదరక తొలగించినట్టు ఓ వాదన వినిపిస్తోంది. నిజానికి Open AI అనేది స్థాపించిన మొదట్లో నాన్‌ప్రాఫిట్ కంపెనీగానే ఉంది. ఆ తరవాత క్రమంగా దాన్ని ప్రాఫిట్ కంపెనీగా మార్చేశారు. ఇదంతా ఆల్ట్‌మన్ చేసిన పనే అన్న వాదనలున్నాయి. పైగా ఇటీవల టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కూడా Open AI కంపెనీపై విమర్శలు గుప్పించారు. కంపెనీకి పెద్ద ఎత్తున లాభాలు తీసుకొచ్చి ఆ క్రెడిట్‌ని సంపాదించుకోవాలని ఆల్ట్‌మన్ భారీగానే ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. అయితే...ఈ క్రమంలో సేఫ్‌టీ గురించి పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.