PM Modi Wishes Team India:
World Cup News: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అహ్మదాబాద్ ఇప్పటికే బ్లూ జెర్సీలతో నిండిపోయింది. స్టేడియంకి వేలాది మంది అభిమానులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ టీమిండియాకి విషెస్ చెప్పారు. 140 కోట్ల మంది ప్రజలు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, ఆ అంచనాలకు తగ్గట్టుగా ఆడతారని ఆకాంక్షించారు. ఈ మేరకు స్పెషల్ ట్వీట్ చేశారు.
"ఆల్ ది బెస్ట్ టీమిండియా. 140 కోట్ల మంది ప్రజలు మీ గెలుపు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మీరు బాగా ఆడి ఆ అంచనాలు అందుకుంటారని ఆశిస్తున్నాను. క్రీడాస్ఫూర్తిని చాటాలని ఆకాంక్షిస్తున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ కూడా టీమిండియాకి బెస్ట్ విషెస్ చెప్పారు. "Good Luck" అంటూ ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని తయారు చేశారు. ట్విటర్‌లో ఆ ఫొటోలు షేర్ చేశారు.
టీమిండియా చరిత్ర సృష్టించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్లేయర్స్‌కి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. మీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటాలని అన్నారు.
"టీమిండియాకి బెస్ట్ విషెస్. వరల్డ్ కప్ ఫైనల్‌కి ఆల్ ది బెస్ట్. మీ సత్తా చాటండి. అద్భుతంగా రాణించండి. చరిత్ర సృష్టించండి. మొత్తం దేశమంతా మీ వెంట ఉంది"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
కాంగ్రెస్ పార్టీ కూడా టీమిండియాకి ఆల్ ది బెస్ట్ చెప్పింది. "ఇండియా జీతేగా" అనే సెన్స్ వచ్చేలా ఓ స్పెషల్ ట్వీట్ చేసింది. ప్లేయర్స్ అందరి పేర్లు కలుపుతూ కాస్త స్పెషల్‌గా విషెస్ చెప్పింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే టీమిండియాకి విషెస్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు.