Israeli woman soldier killed: 



అక్టోబర్ 7 న కిడ్నాప్..


Gaza News: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు చేసిన క్రమంలోనే చాలా మంది మహిళలను కిడ్నాప్ చేశారు. వాళ్లలో ఆర్మీకి చెందిన వాళ్లూ ఉన్నారు. ఇజ్రాయేల్‌కి చెందిన ఓ 19 ఏళ్ల సైనికురాలిని అత్యంత దారుణంగా హత్య చేశారు ఉగ్రవాదులు. ఆమె మృతదేహాన్ని గాజా స్ట్రిప్ వద్ద గుర్తించారు. Israel Defense Forces (IDF) ట్విటర్‌లో ఈ విషయం వెల్లడించింది. 19 ఏళ్ల కార్పోరల్ నోవా డెడ్‌బాడీని గాజాలోని Al Shifa Hospital పక్కనే గుర్తించినట్టు తెలిపింది. 


"19 ఏళ్ల నోవాని హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. దారుణంగా చంపారు. గాజాలోని అల్ షిఫా హాస్పిటల్‌ పక్కనే ఆమె మృతదేహం కనిపించింది. ఆమె మృతి పట్ల మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం"


- ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ 




మహిళ మృతదేహం..


అంతకు ముందు ఇదే హాస్పిటల్‌కి సమీపంలో హమాస్ చేతుల్లో బందీ అయిన ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు ఇజ్రాయేల్ సైనికులు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా వేధించి హత్య చేశారు. ఇంట్లో ఉండగానే ఆమె హత్యకు గురయ్యారు. ఇజ్రాయేల్ సైనికులు అల్ షిఫా  హాస్పిటల్‌ని జల్లెడ పడుతున్నారు. హమాస్‌ ఈ హాస్పిటల్‌ని కమాండ్ సెంటర్‌గా మార్చుకుని దాడులకు పాల్పడుతున్నట్టు ఇజ్రాయేల్ ప్రకటించింది. ఇప్పటికే ఆ హాస్పిటల్‌లోని పరికరాలన్నింటినీ తనిఖీ చేశారు. MRI స్కానింగ్ మెషీన్‌లలో పేలుడు పదార్థాలు దొరికాయి. దాదాపు నెల రోజులుగా ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం కొనసాగుతూనే ఉంది.