Israel Attack:   ఇజ్రాయెల్‌పై  పాలస్తీనా మిలిటెంట్లు దాడులు భయానకంగా  ఉన్నాయి.  మహిళ అర్ధనగ్న శవాన్ని ఓపెన్ ట్రక్కులో తీసుకెళ్లి నగరంలో తిరుగుతున్న భయానక దృశ్యాలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇజ్రాయెల్ పై దాడి చేసిన మిలిటెంట్లు పౌరులను హతమార్చి .. బతికున్న వారిని బందీలుగా తీసుకుంటున్నారు. దాడిలో మరణించిన అమాయక పౌరుల మృతదేహాలను ఉగ్రవాదులు ఓపెన్ ట్రక్కుల్లో తీసుకెళ్లి ఊరేగిస్తున్నారు. 


గమనిక : కలవరపరిచే దృశ్యాలు





 


ఓ భయంకరమైన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. హమాస్ మిలిటెంట్లు ఓ మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లి నగరంలో ఊరేగించారు. పాలస్తీనా పౌరులు మహిళ మృతదేహాన్ని దూషించడం, మహిళపై ఉమ్మి వేయడం, చెంపదెబ్బ కొట్టడం వీడియోలో కనిపిస్తోంది.  క్షిపణి దాడుల తర్వాత పాలస్తీనియన్లు దక్షిణ ఇజ్రాయెల్ లోకి చొరబడ్డారని, వారు తమ ఓపెన్ ట్రక్కుల్లో వీధుల్లో తిరుగుతున్నట్లు ఇజ్రాయెల్ నుంచి అనేక భయానక దృశ్యాలు వచ్చాయి. తమకు అడ్డుగా వస్తున్న ఏ ఇజ్రాయెల్ పౌరుడినైనా చంపేస్తున్నారు. 


గమనిక : కలవరపరిచే దృశ్యాలు





 
 
దాదాపు 35 మంది ఇజ్రాయెల్ సైనికులు పట్టుబడినట్లు హమాస్ మిలిటెంట్లకు పట్టుబడినట్లుగా తెలుస్తోంది.  ఇజ్రాయెల్ పై హమాస్ గత కొన్నేళ్లలో జరిపిన అత్యంత భారీ దాడి ఇదే.  ఈ దాడుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా తెలియరాలేదు. అయితే ఈ దాడి తీవ్రతను బట్టి చూస్తే ఇప్పటి వరకు ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా వేస్తున్నారు.                                  


శనివారం ఉదయం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ లోకి సుమారు 5,000 రాకెట్లను ప్రయోగించగా, ఈ దాడిలో ఒక మహిళ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. క్షిపణి దాడుల ముసుగులో హమాస్-పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడ్డారు. సుమారు 50-60 మంది మిలిటెంట్లు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి ప్రవేశించి  వీధుల్లో విధ్వంసం సృష్టించారు.               


ఇజ్రాయెల్ పై దాడికి తామే బాధ్యులమని హమాస్ ప్రకటించుకుంది.   'త్వరలోనే విముక్తి పొందిన జెరూసలేంలో కలుద్దాం' అని హమాస్ నాయకుడు సలేహ్ అల్ అరౌరీ సందేశం ఇచ్చారు. ఇజ్రాయెల్‌లో పరిస్థితి భయంకరంగా ఉందని సోషల్ మీడియాలో వీడియోలు వెల్లడిస్తున్నాయి.