Israel at War:
నెతన్యాహు ప్రకటన..
ఇజ్రాయేల్‌లో పాలిస్తానీ ఉగ్రసంస్థ హమాస్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 5 వేల రాకెట్‌లతో విధ్వంసం సృష్టించాయి. ఈ దాడుల్లో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయేల్ ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గాజీ సరిహద్దు ప్రాంతం వద్ద 80 కిలోమీటర్ల వరకూ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ దాడులపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రజల్ని ఉద్దేశిస్తూ (Benjamin Netanyahu) స్పెషల్ వీడియో విడుదల చేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హమాస్ ఉగ్రవాదులు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
"మనం యుద్ధ వాతావరణంలో ఉన్నాం. మేం కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఈ ఉదయం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ ప్రజల మీద మెరుపుదాడులు చేశారు. వాళ్లను ఆందోళనకు గురి చేశారు. వాళ్లకు కచ్చితంగా దీటైన బదులు చెప్తాం. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ యుద్ధంలో మనం తప్పకుండా గెలుస్తాం"
- బెంజమిన్ నెతన్యూహు, ఇజ్రాయేల్ ప్రధాని