Indian Embassy in Israel: 


రాకెట్ దాడులు..


ఇజ్రాయేల్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. హమాస్ ఉగ్రవాదులు రాకెట్‌లతో దాడులు చేస్తున్నారు. ఇటు ఇజ్రాయేల్ కూడా ఎదురు దాడులు కొనసాగిస్తోంది. ఫలితంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్‌లోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం (The Embassy of India in Israel) సూచించింది. అనవసరంగా బయటకు రావద్దని చెప్పింది. భారతీయుల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సేఫ్‌టీ ప్రోటోకాల్స్‌ని పాటిస్తూ భద్రతా శిబిరాల్లోనే ఉండాలని సూచనలు చేసింది.





స్థానిక అధికారుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. అందులో అడ్వైజరీ డాక్యుమెంట్స్‌ లింక్‌లు షేర్ చేసింది. మిజైల్ దాడులు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇందులో వివరించింది ఇండియన్ ఎంబసీ. ఇజ్రాయేల్‌లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.