Gereja Ayam Chicken Church : హ్యూమన్ సివిలైజేషన్ ఓ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆర్కిటెక్చర్. రకరకాలుగా కట్టడాలు, చిత్రవిచిత్రమైన భవనాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ ఆర్కిటెక్చర్స్ లో ఒకటే ఈ గెరెజా ఆయమ్. సెంట్రల్ జావాలోని మాజెలాంగ్ అనే ఏరియాలో ఉంది ఈ కట్టడం. ఇండోనేషియన్ లాంగ్వేజ్ లో గెరెజా ఆయమ్ అంటే ఇంగ్లీష్ లో చికెన్ చర్చి అని అర్థం.  చూడటానికి కోడి ఆకారంలో ఉంటుంది. వాస్తవానికి వాళ్లు పావురం ఆకారంలో నిర్మించాలని ప్రారంభించారు. అది చూడటానికి కోడిలా తయారైంది. సో డవ్ చర్చి కాస్తా చికెన్ చర్చి లా మారిపోయింది.


కలలో దేవుడు కనిపించి


 ఈ భవన నిర్మాణాన్ని డేనియల్ అలమ్స్ జా 1990లో ప్రారంభించారు. 1989లో అలమ్స్ జౌ ఓ కల వచ్చి సడెన్ గా మెలకువ వచ్చింది అంట. నిద్రలేచి కలలో దేవుడు కనిపించాడు ఆయనకు నేను ఓ భవనాన్ని  నిర్మిస్తాను. అయితే అది ఏ మతానికి చెందినది కాకుండా ఉండాలి అని కన్సస్ట్రక్షన్ మొదలు పెట్టించాడంట. అలా నిర్మాణమైందే ఈ చికెన్ చర్చి. అన్ని మతాల వారూ వచ్చి అందులో ప్రార్థనలూ, ధ్యానం చేసుకునేలా వీలు కల్పిస్తానని చెప్పి మరీ అలానే తయారు చేసేందుకు వేగంగా పనులు చేయించాడు. పావురం శాంతికి చిహ్నం కాబట్టి... శాంతియుతమైన ప్రదేశంగా దీన్ని ప్రజలు భావిస్తారని అనుకున్నారట.


ఆర్థిక కష్టాలు 


కాలక్రమేణా ఆ బిల్డింగ్ కోడి ఆకారంలో కనిపించటం. చికెన్ చర్చిగా ప్రజలు పిలవటం మొదలైంది. ఈ చర్చి నిర్మాణం ప్రారంభించాక... డేనియల్ కి ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆర్థిక కష్టాలు వెంటాడాయి. ఆయన సంపన్నుడు కాకపోవడం, ఉన్న కొద్ది పాటి డబ్బుతోనే నిర్మించేందుకు సిద్ధపడి చాలా పెద్ద భవన నిర్మాణం చేపట్టడం వల్ల ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చాయి. ఇతరుల నుంచి ఆర్థిక సాయం తీసుకుని నిర్మించటం ఇష్టం లేని డేనియల్ ఎంత కష్టమైనా ఓన్ గా నిర్మించాలని అనుకున్నాడట. 2000 సంవత్సరంలో చివరిదశకు వచ్చిన నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత ఈ భవనం క్రమంగా పాతదైపోతూ వచ్చింది.


చర్చి కాకపోయినా 


కానీ ప్రపంచ దేశాల ప్రజలకు డేనియల్ ప్రయత్నం నచ్చింది. అన్ని మతాలనూ సమానంగా చూస్తూ ఆయన నిస్వార్థంతో ఈ భవన నిర్మాణం చేపట్టారని, కానీ స్థానిక ప్రజలే దీన్ని చర్చిగా ప్రకటిస్తూ ఆయన్ని తప్పుపట్టారని పర్యాటకులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇది చర్చిగా లేకపోయినా, చికెన్ చర్చి పేరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టూరిస్టులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు, ఫొటోలూ, వీడియోలూ తీసుకుంటున్నారు. కొంతమంది పెళ్లి ఫొటోషూట్లు కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఇక ఇప్పుడు ఈ భవనాన్ని దివ్యాంగులకు పునరావాస కేంద్రంగా, డ్రగ్స్ కు అడిక్ట్ అయిన వాళ్లకు రీహేబిలిటేషన్ సెంటర్ గా మారిపోయింది.


ఓ డాక్యుమెంటరీ కూడా 


2016లో ఈ చర్చికి సంబంధించి ఓ డాక్యుమెంటరీ తీశారు. అందులో ఓ విచిత్రమైన వాదనను బయటకు తీశారు. అదేంటంటే ఈ చర్చికీ, దగ్గర్లోని అగ్ని పర్వతానికీ సంబంధం ఉంది అని . కోడి తలపై ఉన్న ముళ్లు ఆ ఆకారంలోని కొనలు అగ్నిపర్వతం ఉన్నదిశను చూపిస్తున్నాయని ఆ డాక్యుమెంటరీలో చూపించారు. ఈ వాదనను కొందరు ఖండించగా, మరికొందరు ఆధారాలు లేని ప్రకటనలనంటూ కొట్టిపారేశారు. ఈ డాక్యుమెంటరీ వల్ల కూడా ఈ చర్చికి ప్రచారం పెరిగింది. మరి అగ్నిపర్వతానికి నిజంగానే సంబంధం ఉందా లేదా అన్నది మిస్టరీగా మిగిలిపోయింది.