అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అరుదైన ఘనత సాధించింది. అంగారక గ్రహం మీద ఆక్సిజన్ తయారు చేసే పరిశోధనలో సక్సెస్ అయ్యింది. అంగారక గ్రహం మీద మనిషి మనుగడకు సంబంధించి కీలక పరిశోధనలు చేస్తున్న నాసా.. అక్కడ మనిషి ఉండేందుకు కావాల్సిన ఆక్సీజన్ ను తయారు చేస్తున్నది. ప్రాణ వాయువు తయారీ కోసం నాసా మాక్సీ (MOXIE) అనే పరికరాన్ని ఉపయోగిస్తున్నది. మాక్సీ అంటే మార్స్ ఆక్సిజన్ ఇన్ సితు రీసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్. అంగారకుడిపై ఉన్న కార్బన్ డైయాక్సైడ్ నుంచి ఆక్సీజన్ ను తయారు చేయడం ఈ పరికరం పని.  మాక్సీ బరువు 17.1 కిలోలు ఉంటుంది. ఇది పని చేసేందుకు  300 వాట్ల విద్యుత్‌ అవసరం అవుతుంది.  ఒక్క ప్రయోగం ద్వారా మాక్సీ గంట 6 గ్రాముల  వరకు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలదు.


వ్యోమగాములు ఆక్సిజన్ మోసుకెళ్లాల్సిన అవసరం లేదు


అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా అంగారకుడి మీదకి మనిషిని పంపినప్పుడు సాధారణంగా తమతో పాటు ఆక్సిజన్ ను తీసుకెళ్తారు. ఇకపై ఆ అవసరం ఉండదని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన హేస్టాక్ అబ్జర్వేటరీలో MOXIE మిషన్‌పై ప్రధాన పరిశోధకుడు మైఖేల్ హెచ్ట్ వెల్లడించారు.  ఇకపై మార్స్ మీదే  ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు.  అయితే, ఒక ఖాళీ ఆక్సిజన్ ట్యాంకును అంగారకుడిపైకి తీసుకెళ్లి అక్కడ ప్రాణ వాయువును నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.  


అవసరానికి మించి ఆక్సిజన్ తయారీ


అంగారకుడిపై 95శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంది. ఆక్సిజన్ కేవలం 0.13శాతం మాత్రమే ఉంది. అదే భూమిపై 21శాతం ఉంది. మాక్సీ పరికరం ప్రస్తుతం కారు బ్యాటరీ సైజులో ఉంటుంది. అయితే భవిష్యత్తులో మనిషికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా చేయాలంటే ప్రస్తుతం ఉన్న సైజు కంటే 100 రెట్లు పెద్దదిగా ఉండాలని మైఖేల్ హెచ్ట్ వెల్లడించారు.  చెట్లు ఎలాగైతే ఆక్సిజన్‌ను ఇస్తాయో అదేలా మాక్సీ సైతం ఆక్సీజన్ ఉత్పత్తి చేస్తుందన్నారు. మార్స్ పై పరిశోధనలకు అవసరం అయిన దానికంటే ఎక్కువే ఆక్సీన్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు.


గంటకు 6 గ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి


మార్స్ పై మనిషి  అడుగుపెట్టిన దగ్గర నుంచి అక్కడ పరిశోధనకు  కావాల్సిన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది మాక్సీ. ఈ పరికరం మార్టిన్ తర్వాత  గాలి నుంచి ఆక్సిజన్‌ను తయారు చేస్తోంది. దీని ఆక్సిజన్ అవుట్‌ పుట్ భూమిపై ఉన్న చెట్టు యొక్క ఆక్సిజన్ అవుట్‌ పుట్ రేటుతో సమానంగా ఉంటుంది. తాజాగా ఈ ఫలితాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో వివరించబడ్డాయి. 2021 చివరి నుండి వచ్చిన డేటా ప్రకారం, MOXIE ఏడు వేర్వేరు ప్రయోగాలలో గంటకు ఆరు గ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది.  ఎలాంటి సమయంలోనైనా ఈ పరికరం ఆక్సీజన్ ఉత్పత్తి చేస్తుందని మైఖేల్ హెచ్ట్ తెలిపారు. భవిష్యత్ వ్యోమగాములకు గేమ్‌ ఛేంజర్ కాబోతున్నదన్నారు. వ్యోమగాముల అంతరిక్ష పరిశోధనకు వెళ్లే సమయంలో కృత్రిమ ఆక్సిజన్ ఉత్పత్తి ఎంతో మేలు కలిగించనుందన్నారు.