Indian Doctor Arrest In US: ఒమైర్ ఏజాజ్ (Oumair Aejaz).. వయస్సు 40ఏళ్లు. అమెరికా (America)లో ఉంటున్న భారతీయ డాక్టర్ (Indian Doctor). రోగులకు సేవ చేస్తూ... దేశానికి మంచి పేరు తీసుకురావల్సిన ఈ డాక్టర్ దారి తప్పాడు. తన దగ్గరకు వచ్చిన రోగుల నగ్న వీడియోలు చిత్రీకరించాడు. అతని భార్య ఫిర్యాదుతో ఏజాజ్‌ను ఈనెల 8న అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది. అయితే... విచారణలో ఏజాజ్ వికృత చర్యలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
ఆస్పత్రిలో, ఇంట్లో రహస్య కెమెరాలు...
ఆస్పత్రిలో దుస్తులు మార్చుకునే ప్రాంతాలు, బాత్‌రూమ్‌లు, పేషెంట్ల రూమ్‌ల్లో రహస్య కెమరాలు అమర్చాడు ఏజాజ్. రోగుల నగ్న వీడియోలు చిత్రీకరించాడు. రెండేళ్ల వయస్సున చిన్నారులను వదల్లేదా కీచకుడు. దుస్తులు మార్చుకునే సమయంలో రికార్డ్ అయిన మహిళలు, చిన్నారుల న్యూడ్ వీడియోలు చూస్తూ.. పైశాచిక ఆనందం పొందేవాడని విచారణలో తేలింది. ఆస్పత్రిలోనే కాదు.. తన సొంత ఇంట్లో కూడా రహస్య కెమెరాలు పెట్టుకున్నాడు ఏజాజ్. అతడి వికృత చేష్టలను గమనించిన అతని భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఏజాజ్‌ను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. వేల సంఖ్యలో ఉన్న డిజిటల్ వీడియోలు, ఫొటోలను ఏజాజ్ భార్య.. పోలీసులకు అందించింది. అవి చూసి.. అక్కడి పోలీసులే షాక్ అయ్యారు.
రోగులపై లైంగిక వేధింపులు...
కామాంధుడైన ఏజాజ్ ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే... తన దగ్గరకు చికిత్స కొసం వచ్చిన మహిళలపై.. వారికి తెలియకుండానే లైంగిక దాడి చేశాడు. చికిత్స కోసం వచ్చిన వారికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చేవాడు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక.. వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాయి. ఆ వీడియోలు కూడా రికార్డ్ చేసుకున్నాడు.
భారతీయ డాక్టర్ నేరాల చిట్టా...
2011లో వర్క్ వీసాపై అమెరికా వెళ్లాడు ఏజాజ్. మిషిగన్ రాష్ట్రం ఓక్లాండ్ కైంటీలోని రోచెస్టర్ హిల్స్ నగరంలో ఉంటున్నాడు. అతని ఇంట్లో దొరికిన వేలాది న్యూడ్ వీడియోలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. అతని బాధితులు చాలా మందే ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఏజాజ్ నేరాల చరిత్ర పెద్దదే అని చెప్తున్నారు. ఈ కేసులో ఇంకా విచారణ చేయాల్సి ఉందని.. దర్యాప్తు పూర్తయిన తర్వాత.. అన్ని విషయాలు బయటపెడతామన్నారు. బయట ప్రదేశాల్లో కూడా రహస్య కెమెరాలతో... మహిళలు, చిన్నారుల న్యూడ్ వీడియోలు తీసునట్టు గుర్తించారు. 2023లో గోల్డ్‌ఫిష్ స్మిమ్మింగ్ క్లబ్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా రహస్య కెమెరాలు పెట్టాడు ఏజాజ్. అక్కడ.. తల్లీ, ఆమె పిల్లలు దుస్తులు మార్చుకుంటున్న వీడియోను రికార్డ్ చేసినట్టు గుర్తించారు. ఇలా.. చాలా మంది తల్లులు, పిల్లల నగ్న వీడియోలు తీశాడు ఏజాజ్.
13వేల వీడియోలు స్వాధీనం...
రోచెస్టర్ హిల్స్‌లోని ఏజాజ్ ఇంట్లో నుంచి 13వేల న్యూడ్ వీడియోలు ఉన్న హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 15 ఎక్స్‌టర్నల్ డివైజ్‌లను కూడా తీసుకున్నారు. వాటన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఏజాజ్ బాధితులు వేల సంఖ్యలో ఉండొచ్చని... ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. కేసులు నమోదు చేస్తామంటున్నారు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు.
యూఎస్‌లో వ్యభిచార ముఠాలో తెలుగు యువకులు...
అమెరికాలో వ్యభిచారం చేస్తూ... తెలుగు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. టెక్సాస్ (Texas) లోని డెంటన్‌లో తెలుగు యువకులను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. డెంటన్ కౌంటీ షెరీఫ్‌లో వ్యభిచారాన్ని అరకికట్టేందుకు... పోలీసుల సహకారంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 18 మందిని పట్టుకున్నారు. వీరిలో ఏడుగురు భారతీయులు కాగా... ఐదుగురు తెలుగు యువకులు. వారి పేర్లు... నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జై కిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి.