Elon Musk ok to Trump Offer: అమెరికా అధ్యక్ష ఎన్నికల (US presidential election) రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఎన్నికల్లో విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసక్తికర ప్రకటనలతో ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఏకంగా.. టెస్లా అధినేత (Tesla CEO), స్పేస్ ఎక్స్ సీఈవో (SpaceX CEO) ఎలాన్ మస్క్‌కు బంపరాఫర్ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే... ఎలాన్ మస్క్‌ను తన కేబినెట్ (US Cabinet)లోకి తీసుకుంటానని లేదా.. ప్రభుత్వంలో ముఖ్యమైన సలహాదారుడి (Chief Advisor) పోస్టు ఇస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ట్రంప్ ఆఫర్‌పై స్పందించిన మస్క్.. నాకు ఓకే అంటూ తన ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. సేవ చేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నానంటూ పోస్టు పెట్టారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ అని రాసి ఉన్న పోడియం ముందు నిలబడి ఉన్న ఫొటోను ఆ ట్వీట్‌కు జతచేశారు మస్క్.
సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఎక్స్‌లో ఇటీవేల.. డోనాల్డ్ ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేశారు ఎలాన్ మస్క్. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఆసక్తిక చర్చ జరిగింది. ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షించేందుకు గవర్నమెంట్ ఎఫిషియెన్సీ కమిషన్ ఏర్పాటును ప్రతిపాదించారు మస్క్. ఇందుకు ట్రంప్ కూడా సానుకూలంగానే స్పందించారు. అంతేకాదు.. తాను గెలిస్తే... ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వనున్నట్టు కూడా ప్రకటించారు ట్రంప్. ఆ తర్వాత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ఈ ఆఫర్ ఇచ్చారు ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే... మస్క్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటానన్నారు. ఈ ఆఫర్‌ను అంగీకరిచినట్టు ట్వీట్ చేశారు మస్క్. అంటే... అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే... ఆ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక బాధ్యతలు నిర్వర్తించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది చివరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ (Republican Party) నుంచి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు డోనాల్డ్ ట్రంప్. అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ట్రంప్ దూకుడుకు తట్టుకోలేక... డెమోక్రటిక్ పార్టీ జోబైడెన్ (Joe Biden) ను తప్పించి.. కమలాహారిస్‌ను అధ్యక్ష బరిలోకి దింపింది. దీంతో... అమెరికా ఆధ్యక్ష ఎన్నికల్లో పోటాపోటీ కనిపిస్తోంది. కమలా హారీస్ (Kamala Harris)... ట్రంప్‌ను గట్టిగానే ఢీకొడుతున్నారు. ఇక... టెస్లా అధినేత ఎలాస్ మస్క్.. ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఎక్స్ వేదికగా ఖండించారు మస్క్. జేడీ వాన్స్ (JD Vance)ను ఉపాధ్యక్ష అభ్యర్థికగా ఎన్నిక చేయడాన్ని కూడా ప్రశంసించారు. అంటే... ట్రంప్, ఎలాస్ మస్క మధ్య సంబంధం ఇటీవల కాలంలో.. చాలా ధృడంగా మారినట్టు తెలుస్తోంది. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నారు.
అయితే... డోనాల్డ్ ట్రంప్.. ఎలాన్ మస్క్‌కు పదవి ఆఫర్ చేయడం ఇది తొలిసారి కాదు. 2016 ఎన్నికల్లో గెలిచనప్పుడు కూడా రెండు కీలక అడ్వైజరీ బోర్డులకు మస్క్‌ను ఎంపిక చేశారు. కానీ... మస్క్ 2017లో వాటిని వదులుకున్నారు. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలన్న ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... పదవుల నుంచి తప్పుకున్నారు ఎలాన్ మస్క్. ఇప్పుడు మరోసారి మస్క్‌కు బంపరాఫర్ ఇచ్చారు ట్రంప్. ఏకంగా... కేబినెట్‌లోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. మరి... అమెరికా ప్రజలు... అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపిస్తారో లేదా చూడాలి...? గెలిచాక ట్రంప్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా...? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య బాండ్ మాత్రం బలంగానే ఉందని చెప్పాలి.