Cargo Ship Hijacked in Red Sea:
కార్గో షిప్ హైజాక్..
యెమెన్‌కి చెందిన హౌతి మిలీషియా గ్రూప్ (Houthi Militia Group) ఇంటర్నేషనల్ కార్గో షిప్‌ని (Cargo Ship Hijacked) హైజాక్ చేసినట్టు ఇజ్రాయేల్ ప్రకటించింది. భారత్‌కి వస్తుండగా ఎర్ర సముద్రంలో షిప్‌ని హైజాక్ చేసినట్టు వెల్లడించింది. ఇది ఇరాన్ పనే అని మండి పడింది. ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కార్యాలయం అధికారికంగా ఈ ప్రకటన చేసింది. బ్రిటీష్‌కి చెందిన కార్గో షిప్‌ని హౌతిస్‌తో పాటు టెహ్రాన్ మిత్ర దేశాలు కలిసి ఈ కుట్ర చేశాయని తేల్చి చెప్పింది. అయితే..ఈ షిప్‌లో ఇజ్రాయేల్ పౌరులెవరూ లేరని స్పష్టం చేసింది. ఈ ఉగ్రచర్యని ఖండిస్తున్నట్టు తెలిపింది.
"ఇరాన్ ఉగ్రచర్యలకు ఈ ఘటన మరో ఉదాహరణ. ఇజ్రాయేల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని కావాలనే ఈ కుట్రకి పాల్పడ్డారు. అంతర్జాతీయ షిప్పింగ్ రూట్స్‌లో అడ్డంకులు సృష్టిస్తున్నారు"
- ఇజ్రాయేల్ ప్రధాని కార్యాలయం
హౌతి గ్రూప్ వార్నింగ్..
ఇజ్రాయేల్ ప్రకటనపై హౌతిస్ ఉగ్ర సంస్థ స్పందించింది. ఇజ్రాయేల్ షిప్‌నీ సీజ్ (Israel Ships in Red Sea) చేసినట్టు ప్రకటించింది. ఈ ప్రకటనను ఇజ్రాయేల్ ప్రకటించింది. ఎర్ర సముద్రంలో షిప్‌ని హైజాక్ చేసి యెమెన్ పోర్ట్‌కి తీసుకెళ్లినట్టు హౌతి మిలీషియా గ్రూప్ వెల్లడించింది. హెలికాప్టర్‌లో వచ్చి హైజాక్ చేసింది. హౌతి గ్రూప్ చెబుతున్నట్టుగా ఈ షిప్ తమ దేశానికి కాదని, అది బ్రిటీష్ కంపెనీది అని స్పష్టం చేసింది. జపాన్ సంస్థ ఆ షిప్‌ని మెయింటేన్ చేస్తున్నట్టు తెలిపింది. అందులో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్లలో ఉక్రెయిన్, బుల్గేరియన్, ఫిలిపినో, మెక్సికన్ దేశస్థులున్నారు. హౌతి మిలీషియా గ్రూప్ మరో సంచలన ప్రకటన కూడా చేసింది. ఇజ్రాయేల్ జెండా ఉన్న ప్రతి షిప్‌నీ హైజాక్ చేస్తామని తేల్చి చెప్పింది. ఇజ్రాయేల్ కంపెనీలు ఆపరేట్ చేసే షిప్‌లనూ వదలమని హెచ్చరించింది. వారం రోజుల క్రితమే హౌతి గ్రూప్‌కి చెందిన కీలక సభ్యుడు ఈ వార్నింగ్ ఇచ్చాడు. ఇజ్రాయేల్ పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉంది హౌతి గ్రూప్. హమాస్ ఉగ్రవాదులకు సహకరిస్తోంది. Zaidi Shia Muslim ఉద్యమంలో భాగంగా 1990లో Houthis Group పుట్టుకొచ్చింది. యెమెన్‌లో సున్నీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సున్నీలపై ఆధిపత్యం కోసం 2004 నుంచి యెమెన్ ప్రభుత్వతో యుద్ధం చేస్తూనే ఉన్నారు హౌతిస్ ఉగ్రవాదులు.
Also Read: Gaza News: ఇజ్రాయేల్ బందీలను ఈడ్చుకెళ్తున్న హమాస్ ఉగ్రవాదులు - వీడియో వైరల్