రెండు వేల గజాల స్థలం. ఆరు బెడ్‌రూమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్, గార్డెన్ ఇలా సౌకర్యాలు ఉన్న ఇల్లు రూ. యాభై వేలకే .. త్వరపడండి అని వాట్సాప్ జోక్ మీకు అందే ఉంటుంది. ఆ మెసెజ్ కింద ఎక్కడ అని ఆత్రుతగా చూసే ఉంటారు. చివరికి ఆఫ్ఘనిస్తాన్‌లో అని ఉంటుంది. అంటే.. జోక్ అన్నమాట. అయితే ఇది అలాంటి జోక్ కాదు. నిజమే. నిజంగానే రూ. 87కు ఇల్లు అమ్ముతున్నారు. కాకపోతే మన దేశంలో కాదు. కానీ ప్రపంచప్రఖ్యాతి గాంచిన దేశంలోనే. పట్టణంలోనే. ఇటలీలోని రోమ్ గురించి అందరూ వినే ఉంటారు. ఆ సిటీగా ఓ అరవై, డెభ్బై కిలోమీటర్ల దూరంలో ఓ ఊరు ఉంటుంది. చుట్టూ అందమైన ప్రకృతి ఉంటుంది. చూసినప్పుడు బతికితే అక్కడ బతకాలని అనిపించేంత హాయిగా ఉంటుంది.


అక్కడే 87 రూపాయలకు ఓఇల్లు ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఉండటం మానేశారు. అందరూ ఇళ్లు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరిపోయాయి. దీంతో అక్కడ మళ్లీ జన సంచారం పెరగాలని.. ఇళ్లన్నీ నిండిపోవాలని నష్టమైన సరే ఇటలీ ప్రభుత్వం ఇటలీ కరెన్సీ ఒక యూరో కంటే తక్కువకే అమ్మాలని నిర్మయించుకుంది. అంత అంతమైన నగరం ఎందుకు ఖాళీ అయిందంటే.. ఎప్పుడై యాభై ఏళ్ల కిందట ఓ సారి అక్కడ భూకంపం వచ్చింది. మళ్లీ అలాంటిదేమైనా వస్తుందేమో అని ఆ ప్రాంత వాసులు వలస వెళ్లిపోయారు. మళ్లీ అక్కడ ఉండటానికి ఎవరూ రాలేదు. ఇల్లు కొనుక్కున్న మూడేళ్లలో పునరుద్ధరించుకోవాలని ఇటలీ ప్రభుత్వం  షరతు పెడుతుంది. 


ఇలాంటి ఖాళీ పట్టణాలు చాలా దేశాల్లో ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్లా రూ. 87 కన్నా తక్కువకే ఇస్తున్నారు కూడా.  క్రొయేషియా దేశంలో లెగ్రాడ్ అనే పట్టణం ప్రజలు లేక వెలవెలబోతోంది. ఇక్కడ ఈ 60 ఏళ్లల్లో జనాభా వేలల్లో తగ్గిపోయింది. జనాన్ని తిరిగి రప్పించడానికి అత్యంత చవకగా ఇళ్లు విక్రయిస్తోంది ప్రభుత్వం. లెగ్రాడ్ లో ఇళ్లు కేవలంరూ. 12 కే ఇస్తున్నారు. కొంత మంది కొనేసుకున్నారు కూడా. అయితే ఇలాంటి ఇళ్లు అమ్మేటప్పుడు ప్రభుత్వాలన్నీ షరతులు పెడతాయి. 15 ఏళ్ళు నివసిస్తామనే హామీ పత్రం ఇస్తేనే రూ. 12కి ఇల్లు ఇస్తారు. ఇతర చోట్ల కూడా కొన్ని ఇలాంటి పథకాలు ఉన్నాయి. అయితే ఇండియన్స్ ఆ వంద రూపాయల్లోపు ఇళ్లు కొనుక్కోవడానికి అంత దూరం పోయి అక్కడ ఉండలేరు కాబట్టి.. ఇలాంటి ఆఫర్లు చూసి మన దేశంలో ఎప్పుడైనా పెడతారేమో ఆశపడటం మినహా మరేమీ చేయలేం.