Indian Students US Visa: ఆల్ టైమ్ రికార్డ్.. 55 వేల మంది భారతీయ విద్యార్థులకు యూఎస్ వీసాలు

ABP Desam Updated at: 24 Aug 2021 04:06 PM (IST)

ఈ ఏడాది అత్యధికంగా 55 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసి అమెరికా రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు మంజూరు చేసిన వాటిలో ఇది ఆల్ టైమ్ రికార్డ్.

రికార్డ్ స్థాయిలో భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు

NEXT PREV

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఎంతో మంది భారతీయులు కలలు కంటుంటారు. అలాంటి భారత విద్యార్థులకు అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అత్యధిక మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 55 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు.






కొవిడ్ విజృంభిస్తున్నప్పటికీ అమెరికాకు పయనమయ్యే భారత విద్యార్థుల కోసం అధిక సంఖ్యలో వీసాలు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు.



భారతీయ విద్యార్థులకు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడం చాలా ఇష్టం. అమెరికాలో చదవడం వల్ల ప్రపంచ దేశాల పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు మంచి ఉద్యోగ అవకాశాలను కూడా దక్కించుకోవచ్చు. భారత విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.                   - అతుల్‌ కేశప్‌, దిల్లీలో అమెరికా దౌత్యవేత్త 


వేగంగా మంజూరు..


కరోనా సెంకడ్ వేవ్ వల్ల దాదాపు రెండు నెలల పాటు వీసా జారీ పక్రియలో జాప్యం జరిగింది. ఈ సమయంలో వీసా ఇంటర్వ్యూ ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది మే లో ప్రారంభం కావాల్సిన ఇంటర్వ్యూ ప్రక్రియ జులైలో ప్రారంభించాల్సి వచ్చిందని అతుల్‌ కేశప్‌ అన్నారు. భారతీయ విద్యార్థులకు ఓ సెమిస్టర్‌ సమయం వృథా కాకుండా ఉండేందుకే సాధ్యమైనంత త్వరగా వీసాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

వీసాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్న అమెరికా విదేశాంగ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా వీసాలు జారీ కానీ విద్యార్థులకు త్వరలోనే వీసాలు జారీ అవుతాయన్నారు. 


Also Read: First Salary: ఫస్ట్ శాలరీ తీసుకుంటున్నారా? మరి ప్లాన్ ఏంటి?

Published at: 24 Aug 2021 04:01 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.